బహ్రెయిన్ రోడ్లపై ఇ-స్కూటర్ బూమ్.. రైడ్స్ పై ఆందోళన..!!
- October 21, 2024
మనామా: బహ్రెయిన్ రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్లు లేదా ఇ-స్కూటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జుఫైర్, మనామా, తుబ్లీ, ముహర్రాక్ వంటి ప్రాంతాల్లో ఇ-స్కూటర్ రైడ్స్ సాధారణంగా మారాయి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో చాలా మంది నివాసితులు వాటిపైనే రైడ్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యత,బ్రాండ్ ను బట్టి ఇ-స్కూటర్ల ధరలు BD100 నుండి BD300 వరకు ఉన్నాయి. ఇ-స్కూటర్‌ల వినియోగం పర్యావరణ అనుకూలమైన రవాణా విధానాన్ని అందిస్తున్నప్పటికీ, పెరుగుతున్న రైడర్‌ల సంఖ్య రోడ్డు భద్రత, పాదచారుల నడక మార్గాలపై ఇ-స్కూటర్‌ల రైడ్స్ ఆందోళన కలిగిస్తున్నాయని బహ్రెయిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీమ్ స్థాపకుడు జెరెమీ క్లావెరో తెలిపారు. ఇ-స్కూటర్ల కోసం ప్రత్యేక లేన్‌ల ఏర్పాటు అవసరమని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న జనాదరణ నేపథ్యంలో బహ్రెయిన్‌లో ఇ-స్కూటర్ల కోసం యూరోపియన్ తరహా నిబంధనలను అనుసరించాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







