ప్రముఖ రిటైలర్ లులూ ఐపీఓ.. నవంబర్ 14న లిస్టింగ్..25శాతం వాటా విక్రయం..!!
- October 21, 2024
యూఏఈ: యూఏఈ ప్రముఖ రిటైలర్ లులూ గ్రూప్ 25 శాతం షేర్లను ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా విక్రయించనుంది. ఒక్కో షేర్ విలువ Dh0.051గా ప్రకటించింది. కంపెనీ ప్రాస్పెక్టస్ ప్రకారం.. కంపెనీ మూడు-విడతల IPO ద్వారా 2.582 బిలియన్ల (2,582,226,338) షేర్లను విక్రయించనుంది. ఇది అక్టోబర్ 28న ప్రారంభమై నవంబర్ 5న ముగుస్తుంది. లులూ రిటైల్ హోల్డింగ్ అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్లో జాబితా కానుంది. లిస్టింగ్ నవంబర్ 14న ఉంటుందని భావిస్తున్నారు. అక్టోబర్ 28న ఆఫర్ ధరను ప్రకటించనుంది. లులూ షేర్ విక్రయానికి వచ్చే వారం ఇన్వెస్టర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఏఈతోపాటు GCC ప్రాంతంలో 50వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రిటైలర్లలో లులూ గ్రూప్ ఒకటి. రాబోయే ఐదేళ్లలో GCC దేశాల్లో మరింత విస్తరిస్తామని లులు రిటైల్ CEO సైఫీ రూపవాలా తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







