విశ్వక్ సేన్ కి అంత కాన్ఫిడెన్స్ ఏంటో.!
- October 21, 2024
విలక్షణ నటుడు విశ్వక్ సేన్ ఏం చేసినా అదో సెన్సేషనే. తాజాగా ఆయన నటిస్తున్న సినిమాకి సంబంధించి ప్రమోషన్లు చిత్రంగా అనిపిస్తున్నాయ్.
కాన్ఫిడెన్స్ వుండొచ్చు. కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితేనే కాస్త ఇబ్బంది. ఆల్రెడీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రూపంలో విశ్వక్ సేన్ ఖాతాలో ఓ ఫెయిల్యూర్ వుంది.
ఇప్పుడు ‘మెకానిక్ రాఖీ’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా రేపే అనగా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లేటెస్ట్గా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాటలు విస్తుపోయేలా చేశాయ్.
సినిమాపై బజ్ లేదన్నారు. ఇక నుంచి చూడండి ఏ రేంజ్లో బజ్ వుంటందో అని చెప్పడం ఆయన కాన్ఫిడెన్స్‌కి ప్రతిరూపం. అలాగే, పెయిడ్ ప్రీమియర్లు చూసి సినిమాకి ఏ స్థాయిలో బజ్ వస్తుందో మీరే చూస్తారు.
ఒకవేళ సినిమా బాగాలేదనిపిస్తే.. ఒరిజినల్ రిలీజ్‌కి ధియేటర్లకి జనాలు రావల్సిన పనే లేదు.. అంటూ రకరకాలుగా కామెంట్లు చేసుకున్నాడు తన సినిమా గురించి. గతంలో పలు మార్లు తన సినిమాపై ప్రాంక్ వీడియోలు చేస్తూ.. చిత్రమైన ప్రమోషన్లు చేసేశాడు. కొన్ని వికటించి రచ్చగా మారిన పరిస్థితులు కూడా చూశాం.
ఈసారి ‘మెకానిక్ రాఖీ’ విషయంలో మనోడి ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాధ్ ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో జోడీ కడుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







