షార్జాలో భారీ వర్షాలు.. పర్వత ప్రాంతాలలో జలపాతాలు..అలెర్ట్ జారీ..!!
- October 22, 2024
యూఏఈ: షార్జాలోని ఖోర్ ఫక్కన్ పర్వతాలలో జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి. షార్జాలోని వాడి అల్-హెలౌ రోడ్ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఏర్పడ్డ జలపాతాలు వాహనదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) అలెర్ట్ జారీ చేసింది. ఈ మేరకు ఎల్లో, ఆరెంజ్ అలెర్టలను జారీ చేసింది. ఖోర్ఫక్కన్ రోడ్లో కురుస్తున్న వర్షాలతో ఏర్పడ్డ జలపాతాల వీడియోను స్టార్మ్ సెంటర్ షేర్ చేసింది. ఇదిలా ఉండగా..వాతావరణం రాత్రిపూట తేమగా ఉంటుందని, తీరప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని NCM సూచించింది. అత్యవసరమైతే తప్ప డ్రైవింగ్కు దూరంగా ఉండాలని కోరింది. డ్రైవింగ్ చేసే సందర్భాల్లో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని కోరారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







