రియాద్ సీజన్ 2024.. వారంరోజుల్లో రికార్డు స్థాయిలో సందర్శకులు హాజరు..!!

- October 22, 2024 , by Maagulf
రియాద్ సీజన్ 2024.. వారంరోజుల్లో రికార్డు స్థాయిలో సందర్శకులు హాజరు..!!

రియాద్: రియాద్ సీజన్ 2024 ప్రారంభించిన వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2 మిలియన్ల మంది సందర్శకులు హాజరయ్యారు. ఈ మేరకు జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ టర్కీ అల్-షేక్ ప్రకటించారు.  ఈ సీజన్ లో బౌలేవార్డ్ వరల్డ్, కింగ్‌డమ్ అరేనా, బౌలేవార్డ్ సిటీ, ది వెన్యూ, అల్ సువైదీ పార్క్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం పెరుగుతున్న సందర్శకుల సంఖ్యకు అనుగుణంగా 30% విస్తరించినట్టు తెలిపారు. 5 కొత్త జోన్‌లతో  (సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్, ఆఫ్రికా, కోర్చెవెల్) కలిసి మొత్తం జోన్‌ల సంఖ్య 22కి పెరిగిందన్నారు. దాదాపు 300 రెస్టారెంట్లు, కేఫ్‌లతోపాటు 890 కంటే ఎక్కువ దుకాణాలు ఉన్నాయని తెలిపారు. రియాద్ సీజన్ 2024 సౌదీ అరేబియా నడిబొడ్డున వివిధ వినోద అంశాలను ఒకే వేదికపై అందించే గ్లోబల్ డెస్టినేషన్‌గా గుర్తింపు పొందినట్లు హర్షం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com