రాయల్ ఒపేరా హౌస్ మస్కట్.. నవంబర్ ప్రదర్శనల షెడ్యూల్ విడుదల..!!
- October 23, 2024
మస్కట్: రాయల్ ఒపేరా హౌస్ మస్కట్ (ROHM) కొత్త సీజన్ ప్రారంభం కానుంది. నవంబర్ నెలకు సంబంధించిన క్యాలెండర్ ను నిర్వాహకులు విడుదల చేశారు. ఒపెరా హౌస్ క్యాలెండర్‌లో పోర్చుగీస్ సోల్ మ్యూజిక్, పరేడ్ బ్యాండ్ల అద్భుతమైన ప్రదర్శన, ఓపెన్-ఎయిర్ కచేరీలు, అధునాతన జాజ్ వంటి అనేక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిల్వనున్నాయి. ఎడ్యుకేషనల్ అండ్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో పిల్లల కోసం చదవడం, రాయడం గురించి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పోర్చుగీస్ ప్రముఖ ఫాడో గాయని క్రిస్టినా బ్రాంకో షో నవంబర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిల్వనుంది.
నవంబర్ 5న రాయల్ ఒపెరా హౌస్ ఆఫ్ మ్యూజికల్ ఆర్ట్స్‌లో క్రిస్టినా బ్రాంకోతో కలిసి 'మైస్ క్యూ ఫాడో'లో అద్భుతమైన షో ఉంటుంది. రెండు రోజల తర్వాత ప్రధాన ఒపెరా హౌస్ పాలిష్ మైదానంలో వార్షిక త్రి డే నైట్ సైనిక సంగీత ఉత్సవం జరుగుతుంది. ఒమన్ మిలిటరీ , పోలీసు కవాతు బ్యాండ్‌లు, జోర్డాన్ - ఆస్ట్రియా నుండి విజిటింగ్ బ్యాండ్‌లతో పాటు ఇతర బ్యాండ్లు ప్రదర్శనలు ఉంటాయి. మిలిటరీ సంగీతం: ఒమన్ అండ్ ది వరల్డ్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన ఈవెంట్. ఈ ప్రదర్శనను ఆస్వాదించడానికి నవంబర్ 7, 8 లేదా 9 తేదీలలో సందర్శన ప్లాన్ చేసుకోవాలి.
కొత్త ఓపెన్ ఎయిర్ కాన్సర్ట్ ఫార్మాట్‌లో ఎమిరాటీ సూపర్ స్టార్ అహ్లామ్ నవంబర్ 14న ఈవెంట్ ఉంటుంది. ఆంథోనీ స్ట్రాంగ్ -లాట్వియన్ రేడియో బిగ్ బ్యాండ్ నవంబర్ 28, 29 తేదీలలో రాయల్ ఒపేరా హౌస్ ఆఫ్ మ్యూజికల్ ఆర్ట్స్‌లో జరుగుతాయి. మ్యూజిక్ లైబ్రరీలో ఆంథోనీ స్ట్రాంగ్‌తో నవంబర్ 27న కాఫీ సెషన్ మిస్ అవ్వకండి.
థియేటర్ పై అవగాహనకు నవంబర్ 6, 7 తేదీలలో మస్కట్‌లోని ఎంపిక చేసిన పాఠశాలలకు ఇటాలియన్ రచయిత్రి ఎలిసబెట్టా డామి రచించిన జెరోనిమో స్టిల్టన్ అనే బుక్ క్యారెక్టర్ కు సంబంధించిన వర్క్‌షాప్‌తో ప్రత్యేక ప్రదర్శనను ఇవ్వనున్నారు. లెట్స్ రీడ్, బ్యూటీ అండ్ ది బీస్ట్ (మ్యూజిక్ లైబ్రరీలో నవంబర్ 16, 10am నుండి 1pm వరకు) అద్భుతమైన షో ఉంటుంది. ఒపెరా డి మోంటే కార్లో గాయకులు లా ఫిల్లే డు రెజిమెంట్ నుండి ఒపెరా గల్లెరియాలో నవంబర్ 30న మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రదర్శన ఇస్తారు.
ROHM వెబ్‌సైట్, యాప్ లేదా నేరుగా బాక్స్ ఆఫీస్ వద్ద టిక్కెట్‌లు అందుబాటులో ఉంటాయి. మరింత సమాచారం కోసం ROHM వెబ్‌సైట్‌ను సందర్శించాలని నిర్వాహకులు తెలియజేసారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







