ఉచిత బంగారు నాణేలు, స్పెషల్ డిస్కౌంట్లు: ఈ దీపావళి సీజన్లో బంపర్ ఆఫర్లు..!!
- October 23, 2024
యూఏఈ: .దీపావళి పండుగ నేపథ్యంలో యూఏఈలోని ఆభరణాల కొనుగోలుదారులను ఆకర్షించడానికి తగ్గింపులు, ప్రమోషన్లను జ్యువెలర్స్ షాపులు ప్రకటించాయి. ఉచిత బంగారు నాణేలు, బార్ల నుండి పాత బంగారం మార్పిడిపై సున్నా శాతం తగ్గింపు వరకు అందించనున్నారు. గోల్డ్ ధరలు ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ, బంగారం విక్రేతలు డైమండ్ ఎక్స్ఛేంజ్ , ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్లపై 100% విలువను కూడా అందిస్తున్నారు. మంగళవారం ఉదయం గ్రాముకు Dh331.5(24K)కి పలుకగా, 22K, 21K, 18K వరుసగా గ్రాముకు Dh307.0, Dh297.0, Dh254.75 వద్ద ట్రేడయ్యాయి. స్పాట్ బంగారం ఔన్స్‌కు 0.37 శాతం పెరిగి $2,731.49 వద్ద ట్రేడయింది.
దుబాయ్‌కి చెందిన ఆభరణాల తయారీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పండుగ సీజన్లో భాగంగా ప్రత్యేకమైన ఆభరణాల శ్రేణిని ఆవిష్కరించింది. “బంగారం వజ్రాభరణాలను కొనుగోలు చేసే కస్టమర్లు తమ కొనుగోలుపై ఉచిత బంగారు నాణేనికి అర్హులు. కస్టమర్లు ఎక్కడి నుండైనా కొనుగోలు చేసిన పాత 22కే ఆభరణాలను ఎటువంటి తగ్గింపు లేకుండా.. 8 గ్రాముల బంగారు నాణేలను ఛార్జీలు లేకుండా మార్చుకునే అవకాశాన్ని కూడా మేము అందిస్తున్నాము" అని అంతర్జాతీయ కార్యకలాపాల కోసం జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్యాంలాల్ అహమ్మద్ తెలిపారు.
యూఏఈ ఆభరణాల వ్యాపారి జోయాలుక్కాస్ Dh5,000 విలువైన డైమండ్, విలువైన రాళ్ల ఆభరణాల కొనుగోళ్లపై లేదా Dh20,000 విలువైన బంగారు ఆభరణాలపై ఒక గ్రాము లక్ష్మీ విగ్రహం లేదా బంగారాన్ని ఉచితంగా అందిస్తోంది. డైమండ్, విలువైన రాళ్ల ఆభరణాలలో 3,000 దిర్హామ్‌ల కొనుగోళ్లపై 500 మిల్లీగ్రాముల 24K బంగారు డాలర్లను అందిస్తోంది. దీపాల పండుగగా పిలువబడే దీపావళిని అక్టోబర్ 31, నవంబర్ 1 న జరుపుకోనున్నారు.
"ఈ దీపావళికి, 'గోల్డెన్ దీపావళి'ని ప్రారంభించేందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ దీపావళిని మరింత ప్రకాశవంతంగా చేయడానికి మేము 8-గ్రాముల బంగారు నాణేలపై ఎటువంటి మేకింగ్ ఛార్జీలను వసూలు చేయడం లేదు. పాత బంగారం మార్పిడిపై సున్నా శాతం తగ్గింపు, 10 శాతం ముందస్తు చెల్లింపుతో బంగారం ధర రక్షణకు హామీ ఇవ్వబడుతుంది. డైమండ్ ఎక్స్ఛేంజీలపై 100 శాతం విలువ ఉంది.’’ అని జోయాలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్ జాన్ పాల్ అలుక్కాస్ అన్నారు. దాంతోపాటు యూఏఈలోని వినియోగదారులకు సౌకర్యవంతమైన వాయిదాల చెల్లింపు ఎంపికలను అందిస్తున్నట్లు తెలిపారు.
తనిష్క్, టాటా జ్యువెలరీ బ్రాండ్స్ కూడా ప్రత్యేకాఫర్లను ప్రకటించాయి. వినియోగదారులు మేకింగ్ ఛార్జీలపై 100 శాతం వరకు తగ్గింపుతోపాటు ఉచిత బంగారు నాణేన్ని పొందవచ్చు. “అధిక బంగారం ధరలను అధిగమించాలని చూస్తున్న కస్టమర్ల కోసం బ్రాండ్ పాత బంగారం మార్పిడిలో 100 శాతం ప్రస్తుత తేదీ బంగారు విలువను అందిస్తుంది. పైఉత్తమమైన డీల్‌లపై ఉత్పత్తులను అందించే ప్రత్యేక విభాగాలు స్టోర్లలో ఉన్నాయి. ”అని టైటాన్ కంపెనీ లిమిటెడ్ జ్యువెలరీ ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ ఆదిత్య సింగ్ అన్నారు. లియాలీ జ్యువెలరీ 3,000 దిర్హామ్ అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసినట్లయితే ఉచిత బంగారు నాణేలను అందిస్తోంది. “ఈ సీజన్లో అధిక డిమాండ్ నేపథ్యంలో రిటైలర్లు మేకింగ్ ఛార్జీలు లేదా పండుగ ఆఫర్లపై డిస్కౌంట్లను అందజేస్తున్నారు. ఈ ప్రమోషన్లు వినియోగదారులను ఆకర్షించడంలో సహాయపడతాయి. ”అని లియాలీ జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ సిన్హా అన్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







