పాన్ ఇండియా రెబల్ స్టార్ ...!
- October 23, 2024
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఈ పేరు అంటే తెలియని వారు ఉండరు..బాహుబలి సినిమాతో ఇండియన్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ప్రభాస్. ఆ తర్వాత ‘సాహో’ అంటూ ఆడియన్స్‌ను పలకరించాడు.ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. రీసెంట్‌గా నటుడిగా 22 యేళ్లు పూర్తి చేసుకున్నారు.రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.అయితే ప్రభాస్ ఏ ఏ సినిమాలు చేశాడు? ఎంత క్రేజ్ సంపాదించాడు అనే విషయాలు దాదాపుగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిగర్.. నేడు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు.
ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. 1979, అక్టోబరు 23న మద్రాస్ నగరంలో సినీ నిర్మాత దివంగత ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివ కుమారి దంపతులకు జన్మించాడు. ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఇంజనీరింగ్ చదివిన ప్రభాస్ సినిమాల పట్ల ఆసక్తితో వైజాగ్ లోని సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటనలో శిక్షణ పొందాడు. 2002లో ఈశ్వర్ సినిమాతో హీరో అయ్యాడు.
అరంగేట్రం వరకే వారసత్వం…ఆ తర్వాత నిలబెట్టేది వారి సత్తానే అని ప్రూవ్ చేశాడు ప్రభాస్. తర్వాత రాఘవేంద్ర సినిమాతో వచ్చినా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఆ తర్వాత శోభన్ దర్శకత్వంలో వర్షం సినిమాలో నటించాడు. సినిమాతో అటు అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టడమే కాదు.. మాస్ ఇమేజ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.రాజమౌళి కాంబినేషన్ లో చేసిన ఛత్రపతి మాస్ హీరోగా తిరుగులేని స్టార్ డమ్ అందించింది. డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీస్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ‘రాఘవేంద్ర’ ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’, ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్‌నిరంజన్’ ‘రెబల్’…వంటి సినిమాలన్నీ నటుడిగా ప్రభాస్ వెర్సటాలిటీ చూపిస్తాయి.
ప్రతి సినిమాకు ఫ్రెష్ లుక్‌లో కనిపించడానికి ప్రయత్నిస్తాడు.ఒక రకంగా మంచి హిట్స్ లో ఉండగా రాజమౌళి చెప్పిన బాహుబలి కథ విని దాదాపుగా ఆ కథ కోసం రెండు మూడు ఏళ్లు వెచ్చించాడు ప్రభాస్. అలా సుమారు 600 రోజులు బాహుబలి షూటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సీక్వెల్ కోసం మరో రెండేళ్లు వెచ్చించడంతో ఇలా తన కెరియర్లో దాదాపు ఐదేళ్లు కేవలం బాహుబలి కోసమే వెచ్చించాడు.తెలుగు సినిమాకు 2000 కోట్ల కలెక్షన్స్ సాధించే సత్తా ఉందని బాహుబలి -2తో ప్రభాస్ నిరూపించాడు. ఓవర్‌సీస్ మార్కెట్‌లో పది మిలియన్లకుపైగా వసూళ్లను సాధించిన తొలి హీరో ప్రభాస్. బాహుబలి రెండు సినిమాల తర్వాత ప్రభాస్ ఇమేజ్ టాలీవుడ్ కే పరిమితం చేయలేనంతగా ఎదిగింది. అందుకు తగినట్లే భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్నాడు.
ప్రభాస్ ఏన్నో ఏళ్లగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. తుఫాన్ లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చాడు. 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. సమాజం పట్ల, తన ప్రేక్షకుల పట్ల ప్రభాస్ కు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు సంపాదించుకుంటున్న తొలి సౌత్ హీరోగా కూడా రికార్డ్స్ క్రియేట్ చేశాడు ప్రభాస్.
‘సలార్’ ‘కల్కి 2898 ad’ వంటి చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టి, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ సినిమా చేస్తున్నాడు.వచ్చే ఏడాది అంటే ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.హారర్ రొమాంటిక్ జోనర్ లో రూపొందుతున్న సినిమా ఇది. ఇక దీంతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు.అలాగే వచ్చే నెలలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ కూడా ప్రారంభం కానుంది.తన రాబోయో సినిమాలతో తెలుగు సినిమా గర్వించే విజయాలు సాధించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే ప్రభాస్
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!