బీఎస్ఎన్ఎల్ కొత్త లోగో టారిఫ్‌ల పెంపు లేదని స్పష్టం
- October 23, 2024
న్యూ ఢిల్లీ: మొబైల్ టారిఫ్‌లకు సంబంధించి ప్రభుత్వరంగ నెట్వర్క్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. సమీప భవిష్యత్తులో టారిఫ్‌లు పెంచే ప్రణాళిక లేదని తెలిపింది. ‘సమీప భవిష్యత్తులో టారిఫ్‌లను పెంచడం లేదని స్పష్టంగా చెబుతున్నాం’ అని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, ఎండీ రాబర్ట్ రవి పేర్కొన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. వినియోగదారుల సంతోషం, వారి విశ్వాసాన్ని గెలుచుకోవడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. సమీప భవిష్యత్తులో టారిఫ్‌లను పెంచాల్సిన అవసరం కనిపించడం లేదన్నారు. ఇక, వేగవంతమైన 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్న బీఎస్ఎన్ఎల్ తాజాగా కంపెనీ లోగోను మార్చింది. గతంలో వృత్తాకారంలోని ఊదా రంగు లోగోపై నీలం, ఎరుపు వర్ణంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ చిహ్నాలు ఉండగా.. తాజాగా దీనికి మార్పులు చేశారు. కాషాయ రంగు వృత్తాకారం మధ్యలో భారత చిత్రపటాన్ని ఉంచారు. దానిపై తెలుపు, ఆకుపచ్చ వర్ణంలో కనెక్టివిటీ సింబల్స్‌ను ఉంచారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







