‘లక్కీ భాస్కర్’.! అంత కాన్ఫిడెన్సా.!
- October 23, 2024
ఈ సినిమాలో తప్పులు వెతకడమే కష్టమట. ఒకవేళ అలా తప్పులు వెతికితే ఓ గ్రాండ్ పార్టీ ఇస్తా.. అని కాన్ఫిడెంట్గా చెబుతున్నారు సినిమా నిర్మాతలు. ఇంతకీ సినిమా ఏంటంటారా.? ‘లక్కీ భాస్కర్’.
‘సీతారామం’ సినిమాతో పాపులర్ అయిన దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది.
‘సార్’ సినిమా సక్సెస్ తర్వాత వెంకీ అట్లూరి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగా వున్నాయ్. ప్రచార చిత్రాలూ, పాటలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయ్.
ఇక, సినిమాకి సంబంధించి లేటెస్ట్గా జరిగిన ఓ ప్రెస్ మీట్లో భాగంగా మేకర్లు సినిమా విజయంపై పూర్తి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. డబ్బు ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ బ్యాంక్ ఉద్యోగిగా పని చేస్తాడు.
ధనం మూలం మిదం జగత్ అనే కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రంలో ఆ డబ్బు సంపాదించడానికి హీరో ఏం చేశాడు.? సడెన్గా ధనవంతుడిగా ఎలా మారాడు.? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చవి చూడాల్సి వచ్చింది.? ఈ తరహా నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. బ్రిలియంట్ స్క్రీన్ప్లే ఈ సినిమాలో చూపించబోతున్నాడట వెంకీ అట్లూరి. చూడాలి మరి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







