‘తండేల్’.! సంక్రాంతికి సెట్ అవుతుందా.!
- October 23, 2024
ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి అందంగా ముస్తాబు కానుంది కొత్త సినిమాలతో. ఆల్రెడీ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి రేస్‌లో రెడీగా వుంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ కాంబో సినిమా కావడం ఓ ఎత్తయితే, దిల్ రాజు సినిమా కావడం మరో ఎత్తు ఈ సినిమాకి.
దిల్ రాజు సినిమాలు సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవుతున్నాయంటే మరే ఇతర సినిమాలకీ ధియేటర్లు దొరకడం చాలా కష్టం.
అయితే, ఇదే సీజన్లో భారీ అంచనాలతో రాబోతున్నాడు అక్కినేని బుల్లోడు నాగ చైతన్య.. చైతూ నటించిన ‘తండేల్’ సినిమా వాస్తవానికి ఎప్పుడో విడుదల కావల్సిన సినిమా ఇది.
వాయిదాల పర్వంతో సంక్రాంతికి సెట్ అయ్యింది. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ, సంక్రాంతికి సినిమా పక్కా అంటున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్యకు సాయి పల్లవి జోడీగా నటిస్తోంది.
సినిమా కంటెంట్‌పై ఇంతవరకూ వచ్చిన ప్రోమోలతో ఓ ఐడియా అయితే వుంది ఆడియన్స్‌లో. చందూ మొండేటి పైనా ఒకింత నమ్మకం వుంది.
సో అలా చూసుకుంటే, ఈ సినిమా సంక్రాంతి రేస్‌లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయమే.
తాజా వార్తలు
- కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్‌పాట్ డాక్టర్‌పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం







