బన్నీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.! ముందుకొచ్చిన ‘పుష్ప’.!

- October 23, 2024 , by Maagulf
బన్నీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.! ముందుకొచ్చిన ‘పుష్ప’.!

 ఆగస్టు 15న రిలీజ్ కావల్సిన ‘పుష్ప 2’ అనివార్య కారణాల వల్ల డిశంబర్ 6కు వాయిదా పడింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఇప్పుడీ డేట్ విషయంలోనూ కొంత గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తోంది.

డిశంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకుంటున్నారట. అంటే ఒకరోజు ముందే ధియేటర్లలో సందడి చేయనుందన్న మాట ‘పుష్ప 2’.

ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూసే. కానీ, అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ కొత్త డేట్ సరికొత్తగా ప్రచారంలోకి వచ్చింది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు అలా ఇలా లేవు. ఎటువంటి అంచనాల్లేకుండా వచ్చిన ‘పుష్ప’ మొదటి పార్ట్ అనూహ్యంగా సెన్సేషనల్ అయిన సంగతి తెలిసిందే.

దాంతో, లేట్ అయినా లేటెస్ట్‌గా ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ సుకుమార్. పక్కా ప్రణాళికలతో రిలీజ్ డేట్ కూడా నిర్ణయించే వుంటాడు. అవన్నీ నిజమే అయితే, ఇయర్ ఎండింగ్‌లో ‘పుష్ప 2’ బాక్సాఫీస్ మోత మోగించేయడానికే సిద్ధమవుతోందనుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com