దక్షిణ కోరియాలో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రులు..నగరాలను పరిశీలించిన మంత్రుల బృందం
- October 23, 2024
హైదరాబాద్: దక్షిణ కోరియాలోని ఇంచియాన్ నగరంలో భాగమైన చియోంగ్న, సాంగడో, యోంగ్ జాంగ్ స్మార్ట్ సిటీలను తెలంగాణ మంత్రుల బృందం నేడు సందర్శించింది. అక్కడ ఉన్న ప్రజా సౌకర్యాలు, అందుతున్న సేవల గురించి వివరాలను అధికారులను అడిగి తెలుకున్నారు. ప్రజా రవాణా, తాగు నీటి సరఫరా, గార్బేజ్ సమస్యలు , డంపింగ్ యార్డ్ ల పరిస్థితులపై ఈ బృందం ఈ మూడు నగరాలలో అధ్యయనం చేసింది.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అధికారులు ఈ పర్యటన టీమ్ లో ఉన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం 2003లో ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ స్థాపించారని చెప్పారు. ఫైనాన్స్ టూరిజం వ్యాపారం కోసం ఒక ఐటీబీటీ హబ్ ను నాలెడ్జ్, సర్వీస్ ఇండస్ట్రీని స్థాపించారని ఇది లాజిస్టిక్స్ మరియు టూరిజం పై దృష్టి సారిస్తుందని తెలిపారు. ఇక్కడ తాము సేకరించిన అభిప్రాయాలతో మూసీ సుందరీకరణ చేపడతామన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







