ఒమన్ లో సముద్ర క్షీరదాలపై సర్వే.. నాలుగో దశ ప్రాజెక్ట్ ప్రారంభం..!!

- October 23, 2024 , by Maagulf
ఒమన్ లో సముద్ర క్షీరదాలపై సర్వే.. నాలుగో దశ ప్రాజెక్ట్ ప్రారంభం..!!

ఖాసబ్: సముద్ర క్షీరదాల సర్వే ప్రాజెక్టు నాలుగో దశ ఖాసబ్ ముసందం గవర్నరేట్‌లోని విలాయత్‌లో ప్రారంభమైంది. వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో ఎన్విరాన్‌మెంట్ అథారిటీ ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది. అక్టోబర్ 31 వరకు సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ లో భాగంగా ముసందమ్‌లోని నేషనల్ నేచర్ పార్క్‌లో సముద్రపు క్షీరదాల సమగ్ర డేటాబేస్‌ను అభివృద్ధి చేయనున్నట్టు ఎన్విరాన్‌మెంట్ అథారిటీకి చెందిన ప్రాజెక్ట్ టీమ్ హెడ్ ఇంజనీర్ ఐదా బింట్ ఖలాఫ్ అల్ జబ్రియా తెలిపారు.  ఆధునాతన టెక్నాలజీ సాయంతో సర్వే నిర్వహిస్తున్నట్లు.. పగడ్బందీగా ఫోటోలు సహా వివరాలను నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అధిక-నాణ్యత కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, గోప్రోలను ఉపయోగించి డేటాను రికార్డు చేస్తున్నట్లు తెలిపారు. సముద్రపు క్షీరదాల ఉనికి, వాటి పునరుత్పత్తిని తెలుసుకునేందుకు పర్యావరణ అథారిటీ ఆసక్తిగా ఉందని ఆయన వివరించారు. ప్రాజెక్ట్ నిర్వహణకు మత్స్యకారుల నుండి విస్తృత సహాయాన్ని తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com