యూఏఈ మొదటి డిస్కౌంట్ ఫార్మసీ.. దుబాయ్‌లోని అవుట్‌లెట్ మాల్‌లో ప్రారంభం..!!

- October 24, 2024 , by Maagulf
యూఏఈ మొదటి డిస్కౌంట్ ఫార్మసీ.. దుబాయ్‌లోని అవుట్‌లెట్ మాల్‌లో ప్రారంభం..!!

యూఏఈ: 30,000 కంటే ఎక్కువ వెల్‌నెస్ ఉత్పత్తు, మెడిసిన్స్ పై ఏడాది పొడవునా తగ్గింపులను అందించే యూఏఈ మొదటి డిస్కౌంట్ ఫార్మసీ దుబాయ్‌లో ప్రారంభమైంది.  దుబాయ్ అవుట్‌లెట్ మాల్‌లో వన్-స్టాప్ డెస్టినేషన్‌గా మెడిసిన్స్, విటమిన్‌లు, సప్లిమెంట్‌లు, చర్మ సంరక్షణ, అందం, క్రీడా పోషణ, అలాగే తల్లి -బిడ్డ సంరక్షణతో సహా వివిధ ఆరోగ్య, సంరక్షణ ఉత్పత్తులను ఒకేచోట అందిస్తోందని అని లైఫ్ హెల్త్‌కేర్ గ్రూప్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ నజర్ చెప్పారు. సీజనల్ డిస్కౌంట్ ప్రమోషన్‌ల మాదిరిగా కాకుండా, 500 కంటే ఎక్కువ ప్రముఖ బ్రాండ్‌ల నుండి 30,000 కంటే ఎక్కువ ఉత్పత్తులపై కస్టమర్‌లకు ఏడాది పొడవునా 25 నుండి 35 శాతం క్యుములేటివ్ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు తెలిపారు. అయితే, ప్రిస్క్రిప్షన్ మందుల ధరలను ఆరోగ్య అధికారులు నియంత్రిస్తారని.. కాబట్టి డిస్కౌంట్‌లు వర్తించవని స్పష్టం చేశారు. దీనిని ఆఫ్-ప్రైస్ రిటైల్ మాల్ అని కూడా పిలుస్తున్నారు. లైఫ్ హెల్త్‌కేర్ గ్రూప్ రాబోయే రెండేళ్లలో యూఏఈలో  25 రాయితీ ఫార్మసీ స్టోర్‌లను తీసుకురావాలని ప్లాన్ చేస్తోందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com