టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానం లో బాంబు
- July 07, 2015
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ కు సుమారు 148 మంది ప్రయాణికులతో బయలుదేరిన టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానంలో ఉన్నట్టుండి బాంబు కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. క్యాబిన్ లో బాంబును కనుగొన్న పైలట్.. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. ఆ సమయానికి దగ్గరలో ఉన్న న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అనుమతి తీసుకుని అత్యవసరంగా విమానాన్ని కిందకు దించారు. దీంతో న్యూఢిల్లీ విమానాశ్రయంలో అత్యవర పరిస్థితిని ప్రకటించారు. అన్ని భద్రతా దళాలతో పాటు నేషనల్ సెక్యూరిటీ దళాలను అప్రమత్తం చేసి హై ఎలర్ట్ ప్రకటించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ , అగ్నిమాపక దళాలు హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్నాయి. విమానం లోపల, రన్ వే తదితర ఏరియాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. దీనిపై ఎన్ ఎస్ జీ అధికారులు, ఇతర సీనియర్ అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారని సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







