కిడ్నీలకు ముప్పుతెచ్చే డయాబెటీస్, బీపీ
- July 07, 2015
మన శరీరంలో కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కిడ్నీలలోని అతి చిన్న భాగాలు ముఖ్యంగా ఈ వడపోత పనిని చేయడం జరుగుతుంది. ఈ భాగాలను గ్లోమరులస్ అని అంటారు. ఇవి కిడ్నీల్లో లక్షల సంఖ్యలో ఉంటాయి. హైబీపీ ఉన్నవారిలో రక్తం అధిక పీడనం, ఒత్తిడి కలిగి ఈ గ్లోమరులస్ పొరలలోకి చేరడం వల్ల ఈ పొరలు కూడా అధికంగా పీడనానికి గురి కావడం జరుగుతుంది. దాంతో పొరల యొక్క గోడలు దళసరిగా మారడంతో వడపోత సామర్థ్యం తగ్గిపోవడం జరుగుతుంది. మధుమేహం ఉన్న వారి రక్తంలో గ్లూకోజ్ శాతం అధికంగా ఉంటుంది. ఈ అధిక గ్లూకోజ్ ఉన్న రక్తం గ్లోమరులస్ పొరలలోకి చేరడం వల్ల అక్కడ గ్లూకోజ్ శాతం ఎక్కువయి ఈ పొరలు తమ స్వభావాన్ని మార్చుకోవడం వల్ల వడపోత సామర్ధ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలను తెలుసుకోవడానికి చాలా మంది సీరం క్రియాటినన్ అనే పరీక్ష చేయించుకుంటుంటారు. అదొక్కటే పూర్తిగా కిడ్నీ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సరిపోదు. 'ఈజీఎఫ్ఆర్' అనే పరీక్ష చేయించుకోవడం ద్వారా కిడ్నీల పూర్తి పనితీరును తెలుసుకోవచ్చు. డాక్టర్ల సూచన మేరకు క్రమం తప్పకుండా స్కానింగ్, ఇతరత్రా పరీక్షలు చేయించుకుని, తగిన వైద్య సహాయం పొందితే మధుమేహులు, బీపీతో బాధపడ్తున్నవారు కిడ్నీలను సంరక్షించుకోవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







