బాలయ్య తో పోటీకి సిద్దం...
- June 23, 2016
రాం చరణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా " ధృవ " ఇప్పుడు అడ్డంకులు అన్నీ దాటుకుని చివరికి స్పీడ్ గా షూటింగ్ మొదలు పెట్టింది. పోయిన నెల రోజుల నుంచీ షూటింగ్ మొదలు పెట్టిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి సినిమా ని మరొక రెండు నెలల్లో పూర్తి చేసి సెప్టెంబర్ 30 న విడుదల కి సిద్దం అవుతోంది. ఆ సినిమా విడుదల అయిన వెంటనే చరణ్ తన కొత్త సినిమా పనులు మొదలుపెట్టేయడానికి సిద్దం అయిపోయాడు.
విలక్షణ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో చరణ్ సినిమా అంటే ఇప్పటి నుంచే మెగా ఫాన్స్ కి ఆసక్తి రేగుతోంది. దసరా కానుకగా ధృవ విడుదల అవ్వగానే సరిగ్గా వారం అంటే వారం గ్యాప్ లో కొత్త సినిమా మొదలు పెట్టేసి సంక్రాంతికి వచ్చెయ్యాలి అనేది చరణ్ ప్లాన్ అట.
మగధీర తరవాత ఆరెంజ్ పక్కన పెడితే చరణ్ అన్నీ రొటీన్ సినిమాలు చేసాడు. ధృవ స్టొరీ మాత్రం చాలా భిన్నం అయినది, దాని తరవాత సుకుమార్ సినిమా కాబట్టి క్రియేటివిటీ కి ఎక్కడా తగ్గేది ఉండదు. సో బ్యాక్ టూ బ్యాక్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ మనోడు దూసుకుపోతున్నాడు.
సుకుమార్ స్టైల్ లో విలక్షణ ఫార్ములా తో రంగం లోకి దిగుతున్నాడు చరణ్. ఇప్పటికే ఫార్ముల ఎక్స్ అనే టైటిల్ ని అనుకుంటున్నారట ప్రొడ్యూసర్ లు. నాన్నకు ప్రేమతో తో ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ ఈ సినిమా విషయం లో కూడా 1 నేనొక్కడినే లాంటి దారుణ ఫ్లాప్ పరిస్థితి ఎదురు కాకుండా స్క్రిప్ట్ దశ లోనే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని తెలుస్తోంది. సంక్రాంతి కి చరణ్ గనక విడుదల కి సిద్దం అయితే తండ్రితో పోటీ కావచ్చు లేదా బాలయ్య తో పోటీకి సిద్దం అవుతాడు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







