పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 46వ చిత్రంగా రాబోతున్న రణమండల
- October 26, 2024
స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ సారధ్యంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై పీ ఎమ్ ఎఫ్ - 46వ చిత్రానికి సన్నాహాలు మొదలైయ్యాయి. భారీ యాక్షన్ డివోషనల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.హనుమంతుని నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో వీ ఎఫ్ ఎక్స్, యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు కీలకంగా ఉండనున్నాయి.ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన, ఆదోని రణమండల దేవాలయంలో అట్టహాసంగా జరిగింది.రణమండల ఆంజనేయుని సన్నిథానంలో వేద పండితుల ఆశీర్వచనాలతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు సమక్షంలో రణమండల చిత్రం టైటిల్ ఎనౌన్స్ మెంట్ తో పాటు, ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. రణమండల ఆంజనేయని దేవాలయ క్షేత్ర నామాన్నే ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టడం విశేషం. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తర్వలోనే అధికారికంగా విడుదలవుతాయి. టైటిల్ ఎనౌన్స్ మెంట్ సందర్భంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ తన స్వస్థలం ఆదోనిలో సినిమాలు షూటింగ్ చేయాలనే ఎప్పటినుంచో సన్నాహాలు చేస్తున్నప్పటికీ సరైన సమయం, కథ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చిందని, అయితే రణమండల కథ 2022 నుంచే సిద్ధం చేస్తున్నామని, పూర్తిగా ఆదోని పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుందని చెప్పారు. అలానే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు వివరాలతో పాటు, టెక్నీషయన్ల వివరాలు త్వరలోనే అఫీషయల్ గా ఎనౌన్స్ మెంట్ చేస్తామని తెలిపారు. రణమండల ఆంజనేయని సన్నిధిలో రణమండల టైటిల్ ఎనౌన్స్ మెంట్ జరగడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని, నవంబర్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రానున్న పీ ఎమ్ ఎఫ్ 47వ చిత్రాన్ని కూడా ఆదోనిలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ నిర్వహించే విధంగా సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు. మొత్తంగా రెండు చిత్రాల్ని ఆదోనిలో ప్రారంభించి షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా వివరించారు. డివోషనల్, మైథాలజికల్ టచ్ ఉన్న చిత్రాలకి పాన్ ఇండియా వైడ్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుందని, తమ బ్యానర్ లోనే వచ్చిన కార్తికేయ 2 కి వచ్చిన ఆదరణ, అవార్డులు అందుకు అద్భుతమైన ఉదాహరణ అని తెలిపారు. రణమండల చిత్రానికి కూడా అదే రీతిన ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!