టెర్రర్ ఫైనాన్సింగ్‌పై పోరు..ఒమన్ చర్యలకు ప్రశంసలు..!!
- October 27, 2024
పారిస్: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) అక్టోబర్ 21 - 25వరకు పారిస్‌లో జరిగిన గ్రూప్ సమావేశంలో ఒమన్ సుల్తానేట్‌లోని యాంటీ మనీ లాండరింగ్, కౌంటర్ టెర్రరిజం ఫైనాన్సింగ్ సిస్టమ్స్ నివేదికపై చర్చించారు. మనీలాండరింగ్ నిరోధక, ఉగ్రవాద వ్యతిరేక ఫైనాన్సింగ్ వ్యవస్థ అభివృద్ధికి ఒమన్ తీసుకున్న చర్యలు, ప్రయత్నాలను ప్రశంసించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై టాస్క్ ఫోర్స్ సంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా చట్టపరమైన న్యాయపరమైన సహాయానికి సంబంధించిన అంశాలలో అంతర్జాతీయ సహకారం, తీవ్రవాద ఫైనాన్సింగ్ నేరాలను ఎదుర్కోవడం, ఆర్థిక ఆంక్షలను అమలు చేయడం విషయంలో మెరుగైన చర్యలు తీసుకున్నారని కొనియాడారు. అంతకుముందు మనీ లాండరింగ్, టెర్రరిజం ఫైనాన్సింగ్‌ను ఎదుర్కోవడం కోసం తీసుకున్న చర్యలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాహిర్ సలీమ్ అల్ అమ్రీ వివరించారు. నేరస్థుల దోపిడీ నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో దోహదపడేలా ఈ వ్యవస్థ ప్రపంచంలోని మిగిలిన దేశాలతో షేర్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు.ఒమన్ సుల్తానేట్ ఆమోదించిన జాతీయ వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, మనీలాండరింగ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ నేరాలను ఎదుర్కోవడానికి వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఒమన్ సుల్తానేట్ విజయం సాధించిందని చెప్పారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







