ఏపీకి పెట్టుబడులతో తరలి రండి: మంత్రి లోకేష్
- October 27, 2024
అమెరికా: ఏపీకి రండి, ప్రతి పల్లెనూ బాగుచేద్దాం, ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీలోనూ వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాం.. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో మీరూ భాగస్వాములు కండి అని అమెరికాలో పారిశ్రామికవేత్తలకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. యువతకు రాబోయే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఆరు పాలసీలను సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని చెప్పారు.
4వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మీ నుంచి పెద్దఎత్తున పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నారని, ఆశలు, ఆశయాలను నెరవేర్చేందుకు తరలిరావాలని సూచించారు.పెట్టుబడులకు అనువైన వాతావరణం..రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందని లోకేష్ చెప్పారు.
దేశంలోనే 2వ అతిపెద్ద తీరప్రాంతం ఏపీలో ఉందన్నారు. త్వరలో నాలుగు కొత్త పోర్టులు రాబోతున్నాయన్నారు. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని సీఎం సంకల్పించారని, ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా రూపు దిద్దటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఇప్పటికే దేశంలో తయారయ్యే సెల్ ఫోన్లలో 25 శాతం ఏపీలోనే తయారవుతున్నాయని, దేశవ్యాప్తంగా 50 శాతం ఏసీలు కూడా ఏపీలోనే తయారవుతున్నాయని వివరించారు.
అభివృద్ధి వికేంద్రీకరణ దిశలో..అభివృద్ధి వికేంద్రీరణ దిశలో ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అన్నారు.
కృష్ణా, గుంటూరు కేపిటల్ రీజయన్లో 500 కోట్ల డాలర్లు (₹42,015 కోట్లు) తో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని తెలిపారు. డిసెంబర్ నుంచి అమరావతి నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్ ఫోర్ట్స్, పెట్రో కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా రంగాలపై దృష్టిసారించామన్నారు.
రాష్ట్రానికి ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, డేటా సెంటర్ రాబోతున్నాయని, త్వరలో టీసీఎస్ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతోందన్నారు.
రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు యువకుడైన సాయికాంత్ వర్మ నేతృత్వంలో ఈడీబీ పునరుద్దరించినట్టు మంత్రి లోకేష్ వివరించారు. రాజకీయంగా జాతీయస్థాయిలో కీలకపాత్ర వహిస్తుండటం ఏపీకి కలసి వస్తోందని, భారత్‌లో డాటా రెవెల్యూషన్ రాబోతోందన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో 300 కోట్ల డాలర్లు ( ₹25,230 కోట్లు) పెట్టుబడులు సమకూరుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయని, అందులో ఏపీ కీలకపాత్ర పోషించబోతోందని మంత్రి లోకేష్ వివరించారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అందులో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో కాన్సిలేట్ జనరల్ తరపున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకుందన్నారు. సమావేశంలో పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







