పది గ్రాముల పసిడి ధర రూ.29,670కి చేరింది

- June 23, 2016 , by Maagulf
పది గ్రాముల పసిడి ధర రూ.29,670కి చేరింది

వరుసగా రెండో రోజు బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. రూ.30 తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.29,670కి చేరింది. దేశీయ మార్కెట్లో నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం, విదేశీ మార్కెట్ల ప్రభావంతో ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.6 శాతం తగ్గి 1,265.20 డాలర్లకు చేరింది. .
స్వల్పంగా పెరిగిన వెండి వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. రూ. 170 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 41,300కు చేరింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com