అబుదాబి BAPS హిందూ మందిర్..ఘనంగా దీపావళి వేడుకలు.. అన్నకూట్ వేడుకలకు సర్వం సిద్ధం..!!

- November 01, 2024 , by Maagulf
అబుదాబి BAPS హిందూ మందిర్..ఘనంగా దీపావళి వేడుకలు.. అన్నకూట్ వేడుకలకు సర్వం సిద్ధం..!!

యూఏఈ: అబుదాబిలోని చారిత్రాత్మక, ఐకానిక్ BAPS హిందూ మందిర్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాలయం ప్రారంభమైన ఏడు నెలల్లో 1.5 మిలియన్ల మంది భక్తులు సందర్శించారు. ఆలయ డిజైన్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ ప్రత్యేకతలకు అనేతక ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.  

దీపావళి, అన్నకూట్ వేడుకల వేళ.. వందలాది మంది వాలంటీర్లు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. నవంబర్ 2, 3 తేదీలలో అన్నకూట్ హిందూ నూతన సంవత్సర వేడకలను జరుపుకోనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వందలాది స్వచ్ఛమైన శాఖాహార వంటకాలతో నైవేధ్యాన్ని సమర్పించనున్నట్లు వెల్లడించారు. 

ఈ సందర్భంగా వేలాది మంది హాజరయ్యే అవకాశం ఉందని, ట్రాఫిక్, పార్కింగ్ సమస్య తలెత్తకుండా అబుదాబి పోలీసులు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు. సందర్శకులందరూ ఈ మార్గదర్శకాలు, సూచనలను పాటించాలని కోరారు. సందర్శకులందరూ ఆలయానికి చేరుకోవడానికి ముందుగా నమోదు చేసుకోవాలని, తమ సొంత వాహనాల్లో వచ్చే సందర్శకులు అల్ షహమా ఎఫ్1 పార్కింగ్ వద్ద తప్పనిసరిగా పార్క్ చేయాలన్నారు. ఈవెంట్ పార్కింగ్ ప్రదేశం నుండి ఆలయ స్థలం వరకు తరచుగా షటిల్ బస్సులను ప్రభుత్వం నడుపుతుందని తెలిపారు. బ్యాగులు, నగలు, విలువైన వస్తువులను తీసుకురావద్దని సూచించారు.  

నవంబర్ 2 (శనివారం): అన్నకూట్ దర్శనం: ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు.. నవంబర్ 3 (ఆదివారం): అన్నకూట్ దర్శనం: ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు అనుమతిస్తారు. మరింత సమాచారం కోసం mandir.ae/visit ని సందర్శించాలని లేదా విశాల్ పటేల్‌ని [email protected] లో సంప్రదించాలని ఆలయ అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com