దుబాయ్ లో నవంబర్ 24 నుండి మరో 2 కొత్త టోల్ గేట్‌లు..!!
- November 01, 2024
దుబాయ్: రెండు కొత్త సాలిక్ గేట్‌లు..బిజినెస్ బే గేట్, అల్ సఫా సౌత్ గేట్ లు నవంబర్ 24 పనిచేస్తాయని సాలిక్ ప్రకటించింది. రెండు కొత్త టోల్ గేట్లు అల్ ఖైల్ రోడ్‌లోని బిజినెస్ బే క్రాసింగ్ వద్ద, అల్ సఫా సౌత్‌లోని అల్ మైదాన్ స్ట్రీట్, ఉమ్ అల్ షీఫ్ స్ట్రీట్ మధ్య షేక్ జాయెద్ రోడ్‌లో ఉన్నాయని తెలిపింది. వీటితోకలిపి దుబాయ్‌లోని సాలిక్ గేట్ల సంఖ్య ఎనిమిది నుండి 10కి చేరుతుందని పేర్కొన్నారు.
షార్జా, అల్ నహ్దా, అల్ ఖుసైస్ నుండి చాలా మంది వాహనదారులు ఎమిరేట్‌లోని అత్యంత రద్దీగా ఉండే రోడ్‌లలో ఒకటైన అల్ ఖైల్ రోడ్‌ను యాక్సెస్ చేయడానికి ఈ వంతెనను ఉపయోగిస్తున్నందున బిజినెస్ బే అనేది కీలకమైన రహదారిగా ఉంది. కొత్త గేట్లు ట్రాఫిక్‌ను 16 శాతం వరకు తగ్గిస్తాయని సలిక్ CEO ఇబ్రహీం అల్ హద్దాద్ తెలిపారు.
బిజినెస్ బే క్రాసింగ్ గేట్ ద్వారా అల్ ఖైల్ రోడ్‌లో 12 నుండి 15 శాతం, అల్ రబాత్ స్ట్రీట్‌లో 10 నుండి 16 శాతం వరకు.. అల్ సఫా సౌత్ గేట్ ద్వారా షేక్ జాయెద్ రోడ్ నుండి మేడాన్ స్ట్రీట్ వరకు 15 శాతం వరకు ట్రాఫిక్ ను తగ్గిస్తుందని తెలిపారు. ఫైనాన్షియల్ సెంటర్ స్ట్రీట్, మేడాన్ స్ట్రీట్ మధ్య ట్రాఫిక్ వేగం పేరుగుతుందని తెలిపారు. రెండు కొత్త టోల్ గేట్‌లు దాదాపు 100 శాతం సౌరశక్తితో పనిచేస్తాయన్నారు. గత నెల ప్రారంభంలో ఎమిరేట్‌లోని అన్ని టోల్ గేట్‌లకు డైనమిక్ ధరల అమలు గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగిన ప్రచారాన్ని సలిక్ ఖండించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







