అబుదాబిలో బోట్ యజమానికి 20,000 దిర్హామ్‌ల జరిమానా..!!

- November 03, 2024 , by Maagulf
అబుదాబిలో బోట్ యజమానికి 20,000 దిర్హామ్‌ల జరిమానా..!!

యూఏఈ: అబుదాబిలో రోజువారీ పరిమితిని మించి చేపలను పట్టిన ఫిషింగ్ బోట్ యజమానికి పర్యావరణ సంస్థ Dh20,000 జరిమానా విధించింది. ఫిషింగ్ బోట్‌లు కమర్షియల్ ఫిషింగ్ లైసెన్స్‌ని పొంది ఉండాలి. సాధారణంగా ఈ తరహా నౌకలు వీటిని కలిగి ఉండవు. ఈ లైసెన్స్ లేకుండా చేపలు పట్టడం పర్యావరణ ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఇందుకుగానూ 2,000 దిర్హామ్ జరిమానాతో శిక్షిస్తారు. మరోసారి ఇలాంటి చట్టఉల్లంఘన పునరావృతం చేసే నేరస్థులపై భారీ జరిమానాలను విధిస్తారు.  వివిధ జాతుల చేపలు పట్టడానికి యూఏఈలో వేర్వేరు సీజన్ లు ఉంటాయి. ఈ మేరకు అనుమతులను జారీ చేస్తారు. వాటి సంతానోత్పత్తి కాలాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయిస్తారు. 

--ప్రదీప్ (మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com