విజిట్ ఖతార్.. వింటర్ సీజన్ కోసం స్పెషల్ క్యాంపెయిన్..!!
- November 03, 2024
దోహా: విజిట్ ఖతార్ "కతార్ అలా హవాక్" పేరుతో తన కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది ఖతార్ ప్రత్యేకమైన వింటర్ సీజన్ కోసం GCC దేశాల్లో క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా వింటర్ సీజన్ ఎస్కేప్‌కు ప్రముఖ గమ్యస్థానంగా ఖతార్ తన స్థానాన్ని ఎలివేట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని ఆసక్తులు, వయస్సులకు అనుగుణంగా తప్పనిసరిగా సందర్శించాల్సిన ఆకర్షణలు,ఈవెంట్లు ఉన్నాయి.ఈ ప్రచారంలో సౌదీ నటుడు యూసఫ్ అల్ జర్రా, బహ్రెయిన్ కళాకారుడు అహ్మద్ షరీఫ్ నటించారు. విజిట్ ఖతార్ CEO అబ్దుల్ అజీజ్ అలీ అల్ మావ్లావి మాట్లాడుతూ.. ఖతార్ వింటర్ సీజన్ చిన్న పెద్ద విహారయాత్రలకు సరైన గమ్యస్థానంగా మారిందన్నారు. ప్రతి పర్యాటకుడికి మరపురాని క్షణాలను సృష్టించడం తమ లక్ష్యమన్నారు. థ్రిల్లింగ్ అడ్వెంచర్లను కోరుకునే వారి కోసం దోహాలోని ఇండోర్ థీమ్ పార్క్ అయిన క్వెస్ట్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇండోర్ రోలర్ కోస్టర్, డ్రాప్ టవర్‌ను కలిగి ఉంది. 2023లో రికార్డు స్థాయిలో నాలుగు మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి 3.9 మిలియన్ల సందర్శకులు వచ్చినట్టు తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







