ఏ సర్టిఫికేట్ పొందిన త్రిష నాయకి..
- June 23, 2016
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ త్రిష ఈ మధ్య మళ్లీ జోరందుకుందని అనాలి.. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న త్రిష ప్రస్తుతం నాయకిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. కొద్దికాలంగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు సెన్సార్ ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.
త్రిష ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది. ఓ పక్క మోడ్రెన్ గాళ్ గా కనిపిస్తూ పల్లెటూరి అమ్మాయిలా త్రిష కనబడనుంది. ఇక సస్పెన్స్ హర్రర్ కామెడీ మిక్స్ చేస్తూ దర్శకుడు గోవి సినిమాను తీర్చిదిద్దిన విధానం సెన్సార్ వారికి బాగా నచ్చిందట. సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చి త్రిషకు మరో హిట్ అన్నట్టు చెప్పారట.
సో మొత్తానికి సెన్సార్ మెప్పు పొందిన త్రిష నాయకి ఇక రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాల్సి ఉంది. ఓ పక్క వరుస బెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ తరుణంలో త్రిష నాయకికి రిలీజ్ అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన నయాకి టీం సినిమాను వీలైనంత త్వరలో రిలీజ్ చేసేలా చూస్తున్నారు.
కళావతి, చీకటి రాజ్యం సినిమాలతో కెరియర్ లో 50 సినిమాల మైలు రాయిని క్రాస్ చేసిన త్రిష నాయకి సినిమాతో మరో మెట్టు ఎక్కుతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. మరి త్రిష చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సత్యం రాజేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోశించడం జరిగింది
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







