సౌదీ అరేబియా చమురుయేతర ఆదాయాలు.. 9 నెలల్లో 6% వృద్ధి..!!
- November 05, 2024
రియాద్: సౌదీ అరేబియా 2024 మూడవ త్రైమాసికంలో SR30 బిలియన్ల లోటును వెల్లడించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం..సౌదీ అరేబియా చమురు ఆదాయం 2024 మొదటి 9 నెలల్లో 16 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే ఈ సంవత్సరం మొదటి 9 నెలల్లో చమురుయేతర ఆదాయాల వృద్ధి 6శాతంకి చేరుకుంది. మంత్రిత్వ శాఖ 2024 మూడవ త్రైమాసికానికి బడ్జెట్ గణాంకాలను ప్రకటించింది. ఇది మొత్తం SR339 బిలియన్ల ఖర్చులు, SR309 బిలియన్ల ఆదాయాలను నమోదు చేసింది. 2024 మూడవ త్రైమాసికంలో సౌదీ నాన్-ఆయిల్ రాబడి SR118 బిలియన్లు కాగా, చమురు ఆదాయాలు SR191 బిలియన్లుగా ఉన్నాయి.
2024 మొదటి తొమ్మిది నెలల్లో లోటు SR58 బిలియన్లకు చేరింది.ఎందుకంటే రాబడులు SR956 బిలియన్లు కాగా ఖర్చులు SR1 ట్రిలియన్లకు పైగా ఉన్నాయి. సెప్టెంబరు 2024 చివరి నాటికి సౌదీ ప్రభుత్వ రుణం దాదాపు SR1.158 ట్రిలియన్లకు చేరుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ నివేదిక ప్రకారం.. సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఆదాయాలు SR647 బిలియన్లకు చేరుకున్నాయి. ఖర్చులు SR674 బిలియన్లకు చేరాయని, దీని ఫలితంగా SR674 బిలియన్లకు చేరుకుందని తెలిపింది. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కింగ్డమ్ చమురు ఆదాయం SR395 బిలియన్లకు చేరుకుంది. ఇది 10 శాతం వృద్ధిని సాధించింది. అయితే చమురుయేతర ఆదాయం 6 శాతం పెరిగింది. 2023 మొదటి సగంతో పోలిస్తే SR252 బిలియన్లను నమోదు చేసింది. 2024 రెండవ త్రైమాసికంలో SR353 బిలియన్ల ఆదాయాలు, SR369 బిలియన్ల వ్యయాలు SR15.3 బిలియన్ల లోటును నమోదు చేశాయి. సౌదీ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత సంవత్సరంలో 4.4 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, 2025లో 5.7 శాతానికి .. 2026లో 5.1 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు.
సౌదీ ఆర్థిక మంత్రిత్వ శాఖ 2024లో ద్రవ్యోల్బణం రేటు 2.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. 2023లో 2.6 శాతం నుండి, 2026లో 2 శాతం దిగువకు వస్తుందని తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (GDP)లో 2.3 శాతం లోటును అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ప్రాథమిక బడ్జెట్ నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియా మొత్తం వ్యయం SR1,285 బిలియన్లకు చేరుతుందని, ఆదాయాలు 2025లో SR1,184 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 2024లో వాస్తవ GDPలో 0.8 శాతం మరియు 2025లో 4.6 శాతం వృద్ధిని నమోదు చేయాలని సౌదీ అరేబియా లక్ష్యంగా ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







