దుబాయ్ - అబుదాబిల మధ్య కొత్త టాక్సీ-షేరింగ్ సర్వీస్‌.. ట్రయల్ రన్..!!

- November 05, 2024 , by Maagulf
దుబాయ్ - అబుదాబిల మధ్య కొత్త టాక్సీ-షేరింగ్ సర్వీస్‌.. ట్రయల్ రన్..!!

యూఏఈ: దుబాయ్ - అబుదాబిల మధ్య కొత్త టాక్సీ-షేరింగ్ పైలట్ సర్వీస్ ప్రారంభమైంది. ఈ కొత్త సర్వీస్ తో ప్రయాణీకులకు ప్రయాణ ఖర్చులలో 75% వరకు ఆదా అవుతుందని RTA తెలిపింది. ఆరు నెలల పాటు ట్రయల్ రన్ కొనసాగుతుందని,  ఫలితాల ఆధారంగా ఇతర ప్రదేశాలకు విస్తరిస్తామని RTA తెలిపింది. దుబాయ్‌లోని ఇబ్న్ బటుటా సెంటర్, అబుదాబిలోని అల్ వహ్దా సెంటర్ మధ్య ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. ఈ సర్వీస్ ప్రయాణ ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుందని, ముఖ్యంగా దుబాయ్ - అబుదాబి మధ్య తరచుగా ప్రయాణించే వారి కోసం తీసుకొచ్చినట్టు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలో ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ అడెల్ షాక్రి అన్నారు. ట్రయల్ సర్వీస్ ప్రతి ప్రయాణీకుడు పూర్తి ఛార్జీని కవర్ చేయడానికి బదులుగా షేర్డ్ రైడ్‌లో 66 దిర్హామ్‌లు అవుతుందని, ప్రయాణీకులు తమ బ్యాంక్ కార్డ్‌లు లేదా నోల్ కార్డ్‌ల ద్వారా ఛార్జీలను చెల్లించవచ్చని షాక్రి చెప్పారు. ఇద్దరు రైడర్‌లు ఛార్జీని పంచుకున్నప్పుడు ఒక్కో ప్రయాణీకుడికి Dh132, ముగ్గురు ప్రయాణీకులు కలిసి ప్రయాణించినప్పుడు Dh88 అవుతుందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com