అల్ హిస్న్ బిగ్ టైమ్ స్టూడియోస్..రియాద్‌లో ఫిల్మ్, టీవీ ప్రొడక్షన్‌ ఆవిష్కరణ..!!

- November 06, 2024 , by Maagulf
అల్ హిస్న్ బిగ్ టైమ్ స్టూడియోస్..రియాద్‌లో ఫిల్మ్, టీవీ ప్రొడక్షన్‌ ఆవిష్కరణ..!!

రియాద్: రియాద్‌లో “అల్ హిస్న్ బిగ్ టైమ్ స్టూడియోస్”ను జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ (GEA) చైర్మన్ టర్కీ అలల్షిఖ్  ప్రారంభించారు.ఇది చలనచిత్ర,టెలివిజన్ నిర్మాణానికి కొత్త శకానికి నాంది పలికింది. రియాద్ సీజన్‌లో భాగంగా ఆవిష్కరించబడిన ఈ అత్యాధునిక సముదాయం.. రాజధానికి పశ్చిమాన ఉంది. మధ్యప్రాచ్యంలో అత్యంత విస్తృతమైన, అధునాతనమైన ఎంటర్ టైన్ మెంట్ కేంద్రంగా నిలువనుంది.
కేవలం 120 రోజుల్లో పూర్తి చేయబడిన ఏడు స్టూడియో భవనాలలో 10,500 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉంది. పూర్తిగా ఇంటిగ్రేటెడ్ ప్రొడక్షన్ హబ్‌గా రూపొందించబడిన స్టూడియోస్‌లో అత్యాధునిక ప్రొడక్షన్ సూట్‌లు, VVIP సూట్‌లు, హై-టెక్ ఎడిటింగ్ రూమ్‌లు ఉన్నాయి. మెటల్‌వర్క్, కాస్ట్యూమ్ డిజైన్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇది ప్రీ-ప్రొడక్షన్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఫిల్మ్ మేకింగ్  అన్ని అంశాలను అందిస్తుంది.అల్ హిస్న్ బిగ్ టైమ్ స్టూడియోస్.. వినోద రంగంలో సౌదీ అరేబియా పెరుగుతున్న ఉనికిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుందని అధికారం యంత్రాంగం తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com