దుక్మ్ ఆర్థిక జోన్..కార్మికుల రక్షణపై 'హ్యూమన్ రైట్స్' సమీక్ష..!!
- November 06, 2024
మస్కట్: ఒమన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (OHRC) డుక్మ్‌లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో కార్మికులకు అందించే కార్మిక సేవలు, సంరక్షణను సమీక్షించింది. రక్షణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటం, తగిన పని వాతావరణం కల్పించడం, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు అంతర్జాతీయ సౌకర్యాల కల్పనను సమీక్షించారు.కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ రషీద్ బిన్ హమద్ అల్ బలూషి నేతృత్వంలోని ప్రతినిధి బృందం దుక్మ్‌లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో క్షేత్ర పర్యటన చేసిన తర్వాత కమిషన్ తన సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ సందర్శనలో వర్కర్ కమ్యూనిటీలను, వసతిని పరిశీలించారు. ఆ ప్రాంతంలోని ఉద్యోగులతో సంభాషించారు. ప్రతినిధి బృందం ఒమన్ ట్యాంక్ టెర్మినల్ కంపెనీ నిర్వహించే రాస్ మర్కజ్‌లోని లేబర్ క్యాంపు, అల్ నహ్దా లేబర్ విలేజ్ అకామిడేషన్స్, కర్వా మోటార్స్ లేబర్ క్యాంప్ లను పరిశీలించారు.
తాజా వార్తలు
- అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం







