2025లో 65% మంది ఉద్యోగులు జాబ్ మారతారు..పెరిగిన జీవనవ్యయం..సర్వే

- November 06, 2024 , by Maagulf
2025లో 65% మంది ఉద్యోగులు జాబ్ మారతారు..పెరిగిన జీవనవ్యయం..సర్వే

యూఏఈ: యూఏఈలో నియామకాలు వచ్చే ఏడాది పుంజుకోనున్నాయి. రాబర్ట్ హాఫ్ విడుదల చేసిన సర్వే నివేదిక  ప్రకారం.. 63 శాతం మంది ఉద్యోగులురాబోయే 12 నెలల్లో జీతాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. అమెరికాలో ఎన్నికల నేపథ్యంలో అనేక పెద్ద కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలు, నియామకాలను నిలిపివేసాయి.2025లో తమ సంస్థల వృద్ధి బాటలో ప్రయాణిస్తాయని దాదాపు 10 మంది వ్యాపారవేత్తలలో ఏడుగురు (67 శాతం) విశ్వాసంతో ఉన్నారు. 12 నెలల క్రితంతో పోలిస్తే ఈరోజు ఉద్యోగాలను పొందడం సులభమని, కాని అభ్యర్థుల్తో కావాల్సినంత అనుభవం లేదని రాబర్ట్ హాఫ్ చెప్పారు. కాబట్టి వ్యాపారాలు ఇప్పటికే కలిగి ఉన్న ప్రతిభను నిలుపుకోవడం కూడా చాలా ముఖ్యమని సూచించారు. అయితే, రిక్రూట్‌మెంట్ కన్సల్టెన్సీ రాబర్ట్ హాఫ్  2025 సాలరీ గైడ్ ప్రకారం.. దాదాపు సగం మంది వ్యాపారవేత్తలు (47 శాతం మంది) కార్మికులను నియమించుకోవడం సులభమే అయినప్పటికీ, సరైన నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను గుర్తించడం అంత సులభం కాదని చెప్పారు. అదే సమయంలో మూడింట రెండు వంతుల మంది (65 శాతం మంది)2025 ముగిసేలోపు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతారని, వారిలో 30 శాతం మంది జీవన వ్యయం పెరగడంతోనే ఉద్యోగ మార్పు నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారని తెలిపారు.  
రాబర్ట్ హాఫ్‌లోని మిడిల్ ఈస్ట్ డైరెక్టర్ గారెత్ ఎల్ మెట్టూరి మాట్లాడుతూ..ప్రవాసుల రాక వ్యాపారులను సంతోషపెడుతున్నప్పటికీ, తమ ప్రస్తుత ఉద్యోగులపై దీని ప్రభావం గురించి గుర్తుంచుకోవాలని సూచించారు.  "కొత్తగా వచ్చిన ప్రతిభకు చాలా మార్కెట్ ఉన్నప్పటికీ, వారు ఇప్పటికీ సరైన నైపుణ్యం ఉన్న ఉద్యోగులతో సమానంగా పనిచేయడానికి ఎక్కువ కష్టించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని యజమానులు గుర్తుంచుకోవాలి. ప్రత్యేకించి వారికి అరబిక్ మాట్లాడేవారు లేదా మునుపటి యూఏఈ అనుభవం అవసరమైతే. ప్రారంభ వేతనాలు కొన్ని సందర్భాల్లో కొద్దిగా తగ్గవచ్చు.అయితే దేశంలో ఇప్పటికే నివసిస్తున్న పని చేస్తున్న వారిని ఆకర్షించడానికి, ఉద్యోగ ఆఫర్‌లలోని వేతన భాగం పోటీతత్వాన్ని కలిగి ఉండాలి" అని ఎల్ మెట్టౌరీ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com