అనుష్క ఘాటి ఫస్ట్ లుక్ రిలీజ్..
- November 07, 2024
నటి అనుష్క బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అందుకుంది.ఆ తర్వాత పలు సినిమాలు చేసి బిజీ అయ్యింది. నిజానికి బాహుబలి సినిమా తర్వాత అనుష్క వరుస సినిమాలు చేస్తుందని అనుకున్నారు కానీ అడపా దడపా సినిమాల్లో మాత్రమే కనిపించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది.
గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సక్సెస్ అందుకుంది.ఇటీవల కొత్త సినిమా అనౌన్స్ చేసింది అనుష్క. ఘాటీ అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది.అయితే తాజాగా నేడు నవంబర్ 7న అనుష్క పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా నుండి మేకర్స్ అనుష్క ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో అనుష్క రక్తపు ముఖంతో చాలా భయంకరంగా కనిపిస్తుంది. బంగా పొగ త్రాగుతోంది. కన్నీళ్లతో ఉన్న కళ్ళతో చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి సంబందించిన గ్లింప్స్ సైతం ఈ రోజు 4:05 కి విడుదల చేస్తామని పోస్ట్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







