తెలంగాణ: అరుణాచలం టూర్‌కు ప్రత్యేక బస్సులు
- November 07, 2024
హైదరాబాద్: కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు దేశ నలుమూల నుంచి భక్తులు వెళుతుంటారు.అలాగే తెలంగాణ నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వెళ్లనున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్యాకేజీ బస్సులు నడపడానికి, అద్దె ప్రాతిపదికన ఇవ్వడానికి టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
ప్రత్యేక ప్యాకేజీ బస్సులు…
ఈనెల 15న కార్తీక పౌర్ణమి కాగా, 13నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. కాణిపాకం, గొల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున అరుణాచలానికి చేరుకుంటాయి. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ ప్రకటించింది. పూర్తి వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-23450033, 040-69440000 సంప్రదించగలరని సూచించింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







