అబుదాబిలో కోల్డ్‌ప్లే.. ఫ్లైట్ టికెట్ ధరలు 300% పెరుగుదల..!!
- November 07, 2024
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా కోల్డ్‌ప్లే అభిమానులు 'అడ్వెంచర్ ఆఫ్ ఎ లైఫ్‌టైమ్' లో ఉన్నారు. ఎందుకంటే వారి బ్యాండ్ మ్యూజిక్ ఆఫ్ ది గోరేస్ వరల్డ్ టూర్ యూఏఈ చేరుకుంది. జనవరి లో నిర్వహించే కాన్సర్ట్ కోసం ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఆసియా, ఆఫ్రికా, జిసిసి దేశాల ప్రయాణికులకు విమాన టిక్కెట్ల ధరలు 300% వరకు పెరుగుతాయని భావిస్తున్నారు. జనవరి 9, 11, 12, 14 తేదీలలో 44,600 సీట్ల సామర్థ్యం గల జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో కోల్డ్‌ప్లే వరుసగా నాలుగు రాత్రుళ్లు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
ట్రావెల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశం, పాకిస్తాన్, ఇతర జిసిసి దేశాల అభిమానులు అబుదాబి కాన్సర్ట్ లకు హాజరు కావడానికి ఆసక్తి చూపుతారు. అభిమానుల బుకింగ్ లతో ఇప్పటికే విమాన బుకింగ్‌లు ఫుల్ అవుతున్నాయి. ఇది విమాన ఛార్జీల ధరలను పైకి తీసుకెళుతుందని వైస్‌ఫాక్స్ టూరిజంలో అవుట్‌బౌండ్ ట్రావెల్ కోసం సీనియర్ కన్సల్టెంట్ షాంషీద్ సివి అన్నారు. "కోల్డ్‌ప్లే టిక్కెట్లు భారతదేశంలో క్షణాల్లో అమ్ముడయ్యాయి. ఆసియా, జిసిసి దేశాల అభిమానులు కూడా ఉత్సాహం చూపుతున్నారు. చాలామంది ఇప్పటికే ప్రదర్శన కోసం తమ టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. ఇప్పుడు విమానాలలో సీట్ల కోసం డిమాండ్ నెలకొన్నదని షాంషీడ్ అన్నారు. "ప్రస్తుతం, దక్షిణ భారత నగరాల నుండి దుబాయ్ వరకు విమానాలు సగటున DH450 ఖర్చు అవుతుంది. జనవరి రెండవ వారం నుండి డిమాండ్ పెరగడం వల్ల ఈ ఛార్జీలు రెట్టింపు అవుతాయి. ”అని షాంషీడ్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల