ప్రపంచంలోనే తొలి రోబోటిక్ గుండె మార్పిడి..
- November 08, 2024
రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ రియాద్‌లోని తన కార్యాలయంలో ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి రోబోటిక్ గుండె మార్పిడిని నిర్వహించిన సౌదీ వైద్య బృందాన్ని అభినందించారు. రియాద్‌లోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (KFSHRC)కి చెందిన వైద్య బృందం సెప్టెంబరులో ఎండ్-స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న 16 ఏళ్ల రోగికి రోబోట్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి గుండె మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది. ప్రముఖ సౌదీ కార్డియాక్ సర్జన్ డాక్టర్ ఫెరాస్ ఖలీల్ నేతృత్వంలోని వైద్య బృందం.. రెండున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. KFSHRC డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ మజెన్ అల్-రుమైహ్, KFSHRC CEO డా. మజేద్ అల్-ఫయాద్, డిప్యూటీ CEO డాక్టర్ బ్జోర్న్ జోగా క్రౌన్ ప్రిన్స్‌తో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు వైద్య బృందాన్ని, KFSHRC వైద్యులను అభినందించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల