యాదాద్రి పేరు యాదగిరి గుట్టగా మార్పు
- November 08, 2024
తెలంగాణ: యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు.యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.టెంపుల్ బోర్డు ఏర్పాటుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.
విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ పెండింగ్ పనులపై పూర్తి స్థాయి నివేదిక అందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొండపై భక్తులు నిద్ర చేసి మొక్కును తీర్చుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
యాదగిరిగుట్ట పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.యాదగిరి గుట్ట బోర్డు డెవలప్ మెంట్ కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.గత ప్రభుత్వంలో యాదగిరిగుట్ట యాదాద్రిగా మారిన తర్వాత గుట్టపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం లేకుండా పోయింది. అయితే, దీనికి సంబంధించి తిరిగి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్వతంత్ర ప్రతిపత్తి గల బోర్డు ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో మరోసారి రావాలని అధికారులను ఆదేశించారు.
ఇక యాదగిరిగుట్ట డెవలప్ మెంట్ కు సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోశాలకు సంబంధించి ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.విమాన గోపురానికి బంగారు తాపడం కార్యక్రమాన్ని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని చెప్పారు.గత ప్రభుత్వంలో మొదలు పెట్టి ఇంకా పూర్తి చేయని అభివృద్ది కార్యక్రమాలు అన్నింటిని సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.గత ప్రభుత్వం యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చింది.అయితే, యాదగిరి గుట్టగా మార్చాలని, అదే పేరుతో అన్ని రికార్డ్స్ లో మార్చాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







