‘సీ ప్లేన్’ ఆపరేషన్స్ ఏపీ రూపురేఖలను మార్చుతాయి: మంత్రి రామ్మోహన్
- November 09, 2024
న్యూ ఢిల్లీ: విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’పై విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలు వివరాలు తెలిపారు. ఇవాళ జరుగుతున్న సీ ప్లేన్ ఆపరేషన్స్ ఏపీ రూపురేఖలు మార్చడమే కాకుండా దేశ రూపు రేఖలు మార్చనుందని తెలిపారు.
గుజరాత్‌లో మొదలు పెట్టినప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయని చెప్పారు. చంద్రబాబు గైడ్ లైన్స్ తో సీ ప్లేన్స్ తీసుకొస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన మార్గ దర్శకత్వంలో ఏ చాలెంజ్ వచ్చినా ముందుకు వెళుతున్నామని చెప్పారు.
అమరావతిలోనే సీ ప్లేన్స్‌కు ముందడుగు పడుతోందని తెలిపారు. ఉడాన్ స్కీంలోనికి సీ ప్లేన్స్ తీసుకొచ్చినట్లు చెప్పారు.కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ సహకారం కోరినా అంగీకరిస్తామని తెలిపారు.
మంచి వాటర్ బాడీ, నదులువున్నా.. సీప్లేన్ ఏర్పాటు చేస్తామని అన్నారు.డెమో రూట్ కింద ఈ రోజు విజయవాడ నుంచి శ్రీశైలానికి రూట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.నూతన ఎయిర్ పోర్టులకు కూడా సహకారం అందిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







