అతివేగం, పరధ్యానంలో డ్రైవింగ్.. 4 వాహనాలు ఢీ..ఆరుగురికి గాయాలు..!!

- November 10, 2024 , by Maagulf
అతివేగం, పరధ్యానంలో డ్రైవింగ్.. 4 వాహనాలు ఢీ..ఆరుగురికి గాయాలు..!!

యూఏఈ: షార్జాలోని ఎమిరేట్స్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం నాలుగు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఆరుగురు ఎమిరాటీలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారిలో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.  అతివేగం,  పరధ్యానంతో డ్రైవింగ్ చేయడం ఈ భయంకరమైన ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని షార్జా పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే రహదారిపై ఒక వాహనం స్పీడ్ పరిమితిని మించిపోయిందని, ముందున్న భారీ ట్రాఫిక్‌ను డ్రైవర్ గమనించలేదని షార్జా పోలీస్ ట్రాఫిక్ పెట్రోలింగ్ హెడ్ అధిపతి అబ్దుల్లా అల్ మునాజారీ తెలిపారు. రోడ్డుపై డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అన్ని ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అల్ మునాజారీ పిలుపునిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com