దుబాయ్ లో Dh3.7-బిలియన్లతో ఇంటర్నల్ రోడ్లు.. ప్రణాళికకు ఆమోదం..!!

- November 10, 2024 , by Maagulf
దుబాయ్ లో Dh3.7-బిలియన్లతో ఇంటర్నల్ రోడ్లు.. ప్రణాళికకు ఆమోదం..!!

యూఏఈ: దుబాయ్ లో Dh3.7 బిలియన్ల వ్యయంతో 634km మేర అంతర్గత రహదారులను నిర్మించనున్నారు. రాబోయే ఐదు సంవత్సరాల ప్రణాళికను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి,  దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆమోదించారు. ఈ ప్రణాళికలో 12 నివాస, వాణిజ్య పారిశ్రామిక ప్రాంతాలలో 21 ప్రాజెక్టులు ఉన్నాయి.  

రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్ మత్తర్ అల్ టేయర్ ప్రకారం.. 2025లో నాద్ ఎల్ షెబా 3, అల్ అమర్దిలో అంతర్గత రోడ్లు నిర్మించనున్నారు. ఇందులో 482 హౌసింగ్ యూనిట్లు ఉన్నాయి. 100 హౌసింగ్ యూనిట్లతో MBRHE ప్రాజెక్ట్‌ను, హట్టాలో అదనపు అంతర్గత రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. 2026లో RTA నడ్ హెస్సా, అల్ అవీర్ 1లో 92 కి.మీ పొడవునా అంతర్గత రహదారులను నిర్మిస్తారు.  2027లో వార్సన్ 3 (పారిశ్రామిక ప్రాంతం)లో 14 కి.మీ పాటు అల్ అత్బా, ముష్రిఫ్, హట్టా లలో 45 కి.మీ విస్తీర్ణంలో రోడ్లు అభివృద్ధి చేస్తారు. 2028లో 284 కి.మీ.ల మేర మూడు కమ్యూనిటీల మీదుగా రోడ్లను నిర్మించనున్నారు. అలాగే అల్ అవీర్ 1లో 221కి.మీ.ల రోడ్లు, 22కి.మీ పొడవున్న రోడ్లు, వాడి అల్ అమర్ది, హింద్ 3లో 41 కి.మీ రోడ్లను నిర్మించనున్నారు. 2029లో హింద్ 4లో 39కిమీలు, అల్ యలాయిస్ 5లో 161కిమీలతో కూడిన 200-కిమీ పొడవైన అంతర్గత రోడ్లను నిర్మిస్తారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com