ఫలించిన పోరాటం..ఆలీలో కొత్త సెంట్రల్ మార్కెట్ కు ఆమోదం..!!

- November 11, 2024 , by Maagulf
ఫలించిన పోరాటం..ఆలీలో కొత్త సెంట్రల్ మార్కెట్ కు ఆమోదం..!!

మానామా: ఆలీలోని స్థానికుల పోరాటం ఫలించింది. కొత్త మార్కెట్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించేందుకు నార్తర్న్ మునిసిపల్ కౌన్సిల్ నిరంతర ప్రయత్నాల తర్వాత, ఆలీ కొత్త మార్కెట్‌కు ఆమోదం లభించింది. ఈ మేరకు మునిసిపాలిటీ వ్యవహారాల అండర్ సెక్రటరీ, షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా తెలిపారు. మంత్రిత్వ శాఖకు కేటాయించిన స్థలంలో మార్కెట్ నిర్మాణం కోసం పరిశీలిస్తోందని ధృవీకరించారు. అయితే, ఈ ప్లాన్ కు ఇంకా ఆర్థిక, అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ అనుమతులు రావాల్సి ఉందని మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడు అబ్దుల్లా అషూర్ స్పష్టం చేశారు. అనుమతులన్ని త్వరలోనే వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపాదిత సెంట్రల్ మార్కెట్.. స్థానిక వస్తువులను ప్రోత్సహించడంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగాలను అందిస్తుందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com