బహ్రెయిన్ లో ప్రవాసుల ఉద్యోగ ఒప్పందాలపై రెండేళ్ల పరిమితి..!!

- November 11, 2024 , by Maagulf
బహ్రెయిన్ లో ప్రవాసుల ఉద్యోగ ఒప్పందాలపై రెండేళ్ల పరిమితి..!!

మనామా: బహ్రెయిన్ ప్రభుత్వ రంగంలోని ప్రవాసులు రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ పరిమితులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే స్థానిక ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వడానికి, బహ్రెయిన్‌లకు పెరుగుతున్న ఉద్యోగ ఆందోళనలను పరిష్కరించడానికి ఎంపీలు కొత్త హైరింగ్ పాలసీని ముందుకు తెచ్చారు. సివిల్ సర్వీస్ చట్టంలోని ఆర్టికల్ 11ను సవరించాలని ప్రతిపాదించారు.  బహ్రెయిన్‌లకు ప్రభుత్వ రంగ పాత్రలను క్రమంగా అప్పగించాలని డిమాండ్ చేశారు. విదేశీ కార్మికుల ఒప్పందాలను రెండేళ్లకు పరిమితం చేయాలని సూచించారు.

ప్రస్తుతం, అర్హత కలిగిన స్థానిక అభ్యర్థి అందుబాటులో లేనట్లయితే ఆయా స్థానాల్లో బహ్రైన్‌యేతరులను నియమించడానికి అనుమతిస్తున్నారు. అయితే కొత్త ప్రతిపాదన ప్రకారం.. రెండు సంవత్సరాల తర్వాత ప్రవాసుల ఒప్పందాలు ముగుస్తాయి.   ఎంపీలు మహ్మద్ అల్ ఒలైవి, జలీలా అల్ సయ్యద్, మరో ముగ్గురు ఎంపీలు ఈ సవరణను ప్రవేశపెట్టారు.  "ఈ ప్రతిపాదన కాంట్రాక్ట్ నిబంధనలపై స్పష్టమైన పరిమితిని ప్రవేశపెడుతుంది" అని ఎంపీలు వివరణాత్మక నోట్‌లో తెలిపారు.  ఈ ప్రణాళిక సివిల్ సర్వీస్ బ్యూరోకు విదేశీ నియామకాలపై మార్గదర్శకాలను నిర్దేశించే బాధ్యతను కూడా అప్పగిస్తుందని, అవి జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. విదేశీ నియామకాలపై పరిమితి విధించడం వల్ల నైపుణ్యం కలిగిన బహ్రెయిన్ వర్క్‌ఫోర్స్ అభివృద్ధిని వేగవంతం చేస్తుందని, ప్రభుత్వ పాత్రల్లో ప్రవాసులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని ఎంపీలు తెలిపారు.  కాగా, ఈ ప్రతిపాదనను పార్లమెంటరీ కమిటీ సమీక్ష కోసం రిఫర్ చేశారు. అనంతరం పార్లమెంటులో చర్చిస్తారు. అక్కడ ఆమోదించబడినట్లయితే, విదేశీ ప్రభుత్వ రంగ కాంట్రాక్టులపై రెండు సంవత్సరాల పరిమితి విధిస్తారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com