యూఏఈ, జీసీసీలో ట్యాక్స్ అడ్వైజరీ నిపుణులకు ఫుల్ డిమాండ్..!!
- November 11, 2024
యూఏఈ: మిడిల్ ఈస్ట్ లో ట్యాక్స్ అడ్వైజరీ మార్కెట్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే నాలుగు రెట్లు వేగంగా వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. ఈ నేపథ్యంలో యూఏఈ, జీసీసీ దేశాల్లో ట్యాక్స్ సలహాదారుల పోస్టులకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. యూఏఈ, ఒమన్ దేశాల్లో కార్పొరేట్ పన్నులు వ్యక్తిగత ఆదాయపు పన్ను, అలాగే ప్రాంతీయ దేశాలు తీసుకున్న ఇతర కార్యక్రమాల ద్వారా ఈ ఉద్యోగరంగంలో వృద్ధి నమోదవుతుంది. సోర్స్ గ్లోబల్ రీసెర్చ్ ప్రచురించిన కొత్త నివేదిక ప్రకారం.. ఈ ప్రాంతం దాదాపు అన్ని పన్నుల రంగాలలో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్య ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 13 శాతం వృద్ధితో 758 మిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని, ఉత్తర అమెరికా, యూరప్‌లలో 3 శాతం వృద్ధి చెందుతుందని అధ్యయనం వెల్లడించింది.
యూఏఈ గత సంవత్సరం 9 శాతం కార్పొరేట్ పన్నును, 2018లో 5 శాతం విలువ ఆధారిత పన్నును ప్రవేశపెట్టింది. అదేసమయంలో అనారోగ్యకరమైన పానీయాలు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్నును కూడా ప్రవేశపెట్టింది. ఒమన్ సమీప భవిష్యత్తులో వ్యక్తిగత ఆదాయపు పన్నును ప్రవేశపెట్టే ప్రణాళికను ప్రకటించింది. చమురు-ఎగుమతి చేసే గల్ఫ్ దేశాలకు ఆదాయ వనరులను వైవిధ్యపరచడం, పన్నుల ద్వారా సంస్కరణలను అమలు చేయడం "కీలక ప్రాధాన్యతలు" అని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇటీవల ప్రకటించింది.
"మధ్య ప్రాచ్యంలో బలమైన వృద్ధికి తోడు 2025లో అన్ని ప్రాంతాలలో పన్ను సలహా వృద్ధిని తిరిగి పుంజుకుంటామని భావిస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా వ్యక్తమవుతున్న సంక్షోభాల సంఖ్య కంపెనీలకు సవాలుగా ఉంది. అయితే 2025 నాటికి పన్ను సలహా సేవలతో దాదాపు 6 శాతం వృద్ధిని సాధిస్తుంది." అని సోర్స్ గ్లోబల్ రీసెర్చ్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ టోనీ మరౌలిస్ అన్నారు. యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాలు పన్ను కన్సల్టెన్సీ సేవల కోసం ఉద్యోగ కల్పనలో పెద్ద పెరుగుదలను చూశాయన్నారు. "దాదాపు అన్ని పన్నుల రంగాలలో నైపుణ్యం ఉన్న నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. గ్లోబల్ ఎంప్లాయర్/మొబిలిటీ ట్యాక్స్ సర్వీసెస్ ఎక్కువగా ప్రభావితమయ్యాయి. 41 శాతం కంపెనీలు నైపుణ్య నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాయి." అని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







