ఖతార్ లో నవంబర్ 14న సైబర్ సెక్యూరిటీ నైట్ ఈవెంట్‌.. అందరూ ఆహ్వానితులే..!!

- November 11, 2024 , by Maagulf
ఖతార్ లో నవంబర్ 14న సైబర్ సెక్యూరిటీ నైట్ ఈవెంట్‌.. అందరూ ఆహ్వానితులే..!!

దోహా: ఐదవ వార్షిక సైబర్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌ను నవంబర్ 14న ఓపెన్-ఎయిర్ బరాహత్ మషీరెబ్ వేదికగా నిర్వహించేందుకు వైట్ హ్యాట్ డెసర్ట్ (WHD)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని Msheireb ప్రాపర్టీస్ ప్రకటించింది. WHD అనేది సైబర్ సెక్యూరిటీ అవగాహన, ఆవిష్కరణ, సహకారాన్ని ప్రోత్సహించే సైబర్ సెక్యూరిటీ స్టార్టప్. ఆన్‌లైన్ భద్రత గురించి అవగాహన పెంపొందించడానికి కమ్యూనిటీకి అవగాహన కల్పిస్తారు. సైబర్ సెక్యూరిటీలో తాజా టెక్నాలజీల గురించి చర్చించనున్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు, టెక్ ఔత్సాహికులను కాన్ఫరెన్స్ ఒక చోటకు చేర్చుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రీ-రిజిస్ట్రేషన్ ఉదయం పరిశ్రమ సెషన్‌కు మాత్రమే అవసరమని, సాయంత్రం కార్యకలాపాలు ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ప్రవేశం కల్పిస్తున్నట్లు Msheireb ప్రాపర్టీస్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ హఫీజ్ అబ్దుల్లా తెలిపారు. మార్నింగ్ సెషన్ లో గెస్ట్ స్పీకర్‌లు సైబర్‌ సెక్యూరిటీలో ప్రస్తుత ట్రెండ్‌లు, నెట్‌వర్కింగ్, హ్యాకింగ్ పోటీల కోసం ఇంటరాక్టివ్ హబ్‌లు, అలాగే మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ ప్రొవైడర్‌ల పరిష్కారాలను తెలిపే ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.  సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్ పోటీలు, డ్రోన్ రేసింగ్, కోడ్ క్రాకింగ్, సర్క్యూట్ బిల్డింగ్ వర్క్‌షాప్‌లు, వర్చువల్ రియాలిటీ అనుభవాలు, రోబోట్ సుమో ఛాలెంజ్‌లు, 3D ప్రింటింగ్ ప్రదర్శనలపై అతిథి స్పీకర్లతో సహా హైలైట్‌లతో పాటు సైబర్‌సెక్యూరిటీని విద్యాపరంగా ఆకర్షణీయంగా చేస్తుందని వివరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com