సౌదీలో అత్యవసర అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశం
- November 11, 2024
రియాద్: పాలస్తీనా సమస్యను పరిష్కరించడం కోసం ఇంకా ఇజ్రాయెల్ దాడులను ఆపడం కోసం సౌదీ అరేబియా ఈరోజు అత్యవసర అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది. కింగ్ సల్మాన్ ఆదేశాలతో మరియు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు పాలస్తీనా మరియు లెబనాన్లలో తీవ్రమవుతున్న సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది. రియాద్‌లో జరిగిన ఈ సదస్సులో గల్ఫ్ దేశాల ప్రతినిధులతో పాటు ఇతర అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు పాల్గొన్నాయి.
ఇటీవల గాజా, లెబనాన్, ఇరాన్ వంటి ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ సమావేశం ద్వారా పాలస్తీనా రాజ్య స్థాపనపై దృష్టి సారించడం జరిగింది. ఇంకా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తేవడం, మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు కృషి చేయడం వంటి అంశాలపై చర్చించారు. గత సంవత్సరం జరిగిన అరబ్-ఇస్లామిక్ ఎక్స్‌ట్రార్డీనరీ సమ్మిట్‌కు కొనసాగింపుగా ఈ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ప్రధానంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండించడం, లెబనాన్ సమగ్రతను దెబ్బతీసే చర్యలను వ్యతిరేకించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధాన్ని ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై కూడా చర్చించారు.
సౌదీ అరేబియా రాజు సల్మాన్, ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం, పాలస్తీనాకు రాజ్యాధికారం కల్పించేందుకు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తేవడం, మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు కృషి చేయడం వంటి ముఖ్య నిర్ణయాలను తీసుకుంది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







