బహ్రెయిన్‌లో పెరుగుతున్న లేబర్ ఫిర్యాదులు..!!
- November 12, 2024
మనామా: బహ్రెయిన్ లో క్రమంగా లేబర్ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ యొక్క ప్రైవేట్ సెక్టార్ సెక్రటేరియట్‌లోని మానిటరింగ్ కమిటీ సెప్టెంబర్ 2024లో మొత్తం 29 లేబర్ ఫిర్యాదులు నమోదయ్యాయి. అదే సమయంలో హెల్ప్, సలహాల కోసం 63 అభ్యర్థనలను నమోదు చేసింది. మొత్తంగా గత తొమ్మిది నెలల్లో నమోదైన ఫిర్యాదుల సంఖ్య 294కు పెరిగింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 21 మంది మేల్ కార్మికులు, 8 మంది మహిళా కార్మికుల నుండి ఫిర్యాదులు వచ్చాయని, కార్మిక హక్కులకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారించినట్టు మానిటరింగ్ కమిటీ వెల్లడించింది.
14 ఫిర్యాదులు కార్మిక హక్కులు, తొలగింపుతో ముడిపడి ఉన్నాయని, 10 తప్పుడు తొలగింపులుగా కార్మికులు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతోపాటు సస్పెండ్ చేయబడిన ఒక కార్మికునికి సంబంధించిన ఒక కేసు, పునర్నిర్మాణం లేదా పూర్తి/పాక్షిక మూసివేతలకు సంబంధించిన మూడు కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. హెల్త్‌కేర్ పరిశ్రమ నుండి అత్యధికంగా 10 ఫిర్యాదులు రాగా, నిర్మాణ రంగం 7, వాణిజ్య రంగం 5, పారిశ్రామిక, పర్యాటక రంగం, విద్య, రవాణా, సేవలు మరియు టెలికమ్యూనికేషన్ నుండి ఒక్కో ఫిర్యాదు వచ్చాయని పేర్కొన్నారు. జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్‌కు ఏప్రిల్‌లో అత్యధికంగా 176 ఫిర్యాదులు, సెప్టెంబర్‌లో 29, మేలో 24, జూన్‌లో 14 ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







