యూట్యూబ్ కోసం ఫ్రీ ఆడియో ట్రాక్స్ అందించే బెస్ట్ వెబ్సైట్లు ఇవే..
- November 12, 2024
ప్రస్తుతం యూట్యూబ్ క్రియేటర్‌గా గుర్తింపు పొందడం అనేది చాలా కష్టమైన పని. వీరు కంటెంట్‌ను ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉంచేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇంకా వీడియోల నాణ్యత కోసం క్వాలిటీ ఎడిటింగ్, ప్రెజెంటేషన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవన్నీ ఎంతో జాగ్రత్తగా పాటించినప్పటికి ఆడియో విషయంలో ఎప్పుడు గందరగోళంమే. ఎందుకంటే వీడియో ఎంత బాగున్నప్పటికీ సరైన ఆడియో ట్రాక్ లేకపోతే వ్యుయర్స్ నీ ఆకట్టుకోలేదు. అలా అని సినిమా ట్రాక్స్ వాడలేరు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆడియో కాపీ రైట్ వస్తుంది. అసలు కాపీ రైట్ సమస్యలు రాకుండా ఉండాలంటే రాయల్టీ ఫ్రీ లేదా క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ఉన్న మ్యూజిక్‌ను ఉపయోగిస్తే కాపీ రైట్ రాదు. ఇందుకోసం యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుండి మ్యూజిక్‌ను డౌన్లోడ్ చేయడం మంచిది. అసలు ఆడియో కాపీ రైట్ రాకుండా ఫ్రీగా adio traks అందించే వెబ్ సైట్స్ గురించి తెలుసుకుందాం.
యూట్యూబ్‌లో కాపీ రైట్ రాకుండా ఫ్రీ మ్యూజిక్ ట్రాక్స్ అందించే కొన్ని వెబ్సైట్లు:
YouTube Audio Library - యూట్యూబ్ ప్రత్యేకంగా కంటెంట్ క్రియేటర్ల కోసం ఉచిత ఆడియో ట్రాక్స్ అందిస్తుంది.
Free Music Archive - రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ ట్రాక్స్ అందించే వెబ్సైట్.
Bensound - వీడియో క్రియేటర్ల కోసం ఉచిత మ్యూజిక్ ట్రాక్స్.
SoundCloud - ఉచిత మరియు పెయిడ్ సబ్స్క్రిప్షన్లు అందించే వెబ్సైట్.
Incompetech - కేవిన్ మెక్లియాడ్ అందించే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్.
Jamendo - క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద ఉచిత మ్యూజిక్.
Audionautix - రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ ట్రాక్స్.
ccMixter - క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద ఉచిత మ్యూజిక్.
Purple Planet - ఉచిత మ్యూజిక్ ట్రాక్స్.
Musopen - పబ్లిక్ డొమైన్ మ్యూజిక్.
FreePD - పబ్లిక్ డొమైన్ మ్యూజిక్.
TeknoAXE - రాయల్టీ ఫ్రీ మ్యూజిక్.
Josh Woodward - ఉచిత మ్యూజిక్ ట్రాక్స్.
Free Stock Music - రాయల్టీ ఫ్రీ మ్యూజిక్.
Moby Gratis - ఉచిత మ్యూజిక్ ట్రాక్స్.
Silverman Sound Studios - రాయల్టీ ఫ్రీ మ్యూజిక్.
Filmstro - ఉచిత మ్యూజిక్ ట్రాక్స్.
Epidemic Sound - ఉచిత ట్రయల్ తో రాయల్టీ ఫ్రీ మ్యూజిక్.
Artlist - ఉచిత ట్రయల్ తో రాయల్టీ ఫ్రీ మ్యూజిక్.
PremiumBeat - రాయల్టీ ఫ్రీ మ్యూజిక్.
ఈ వెబ్సైట్లు కాపీ రైట్ సమస్యలు లేకుండా యూట్యూబ్ వీడియోల కోసం మ్యూజిక్ ట్రాక్స్ అందిస్తాయి. వీటిని ఉపయోగించి కంటెంట్‌ను మరింత ఆకర్షణీయంగా చేయవచ్చు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







