జగన్ బెయిల్ రద్దు పై సుప్రీంలో విచారణ వాయిదా..
- November 12, 2024
న్యూ ఢిల్లీ: వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సీజేఐ ధర్మాసనం మరో బెంచ్‌కు మార్చింది.జగన్ బెయిల్ రద్దు చేయాలని, విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గతంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
దీనిపై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపి పిటిషన్లపై విచారణ బెంచ్‌ను మార్చింది. సీజేఐ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్‌కుమార్ సభ్యుడిగా ఉన్నారు. విచారణ ప్రారంభం కాగానే.. ఈ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి అని జగన్ తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్ తెలిపారు.
మారిన పరిస్థితుల నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు కూడా కొంత సమయం కావాలని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. ఈ క్రమంలో జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అనడంతో రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను మరో ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేశారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు డిసెంబర్ 2న విచారణకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







