DSF కోసం 3 మిలియన్ దిర్హామ్‌ల నగదు బహుమతి ప్రకటన..!!
- November 13, 2024
దుబాయ్: ఈ సంవత్సరం యూఏఈ నివాసితులు, సందర్శకులు ఐకానిక్ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 30వ ఎడిషన్ ముగింపులో గ్రాండ్ లాటరీలో 3 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకునే అవకాశం ఉంది. ఈ ఫెస్టివల్‌లో అందజేయబడుతున్న అతిపెద్ద సింగిల్ క్యాష్ అవార్డు ఇదే. డ్రీమ్ దుబాయ్ వెబ్‌సైట్‌లో షాపింగ్ చేయడం ద్వారా ఆన్‌లైన్ డ్రా లో పాల్గొని బహుమతిని గెలుచుకోవచ్చు.
దుబాయ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ గ్రూప్ ద్వారా జరిగిన లాటరీ డ్రాలో భాగంగా షాపర్లు 1.5 మిలియన్ దిర్హామ్, 20 కిలోల కంటే ఎక్కువ బంగారాన్ని గెలుచుకునే అవకాశం కూడా ఉంది. తొలిసారిగా బంగారం లవడానికి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. DSF సమయంలో ఇతర బహుమతులలో రోజువారీ Dh10,000 నగదు బహుమతి, సరికొత్త లగ్జరీ కార్లు, ఒక మిలియన్ స్కైవార్డ్ పాయింట్లు ఉన్నాయి.
38 రోజుల వేడుకల్లో(డిసెంబర్ 6 నుండి జనవరి 12 వరకు) DSF 50 కంటే ఎక్కువ కాన్సర్ట్ లు, ఈవెంట్‌లను నిర్వహిస్తున్నారు. రోజుకు రెండుసార్లు 1000 డ్రోన్లతో పాటు రోజువారీ ఫైర్ వర్క్స్ తో కూడిన డ్రోన్ షో కూడా ఉంటుంది. హట్టా వద్ద వీకెండ్ ఫైర్ వర్క్స్ కూడా ఉంటుంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్‌లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







