రహమాన్ మ్యూజిక్..కోహ్లీ పాట

- June 24, 2016 , by Maagulf
రహమాన్ మ్యూజిక్..కోహ్లీ పాట

మైదానంలో తనదైన స్పీడుతో దూసుకెళ్లే టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ సింగర్ అవతారమెత్తారు. ప్రీమియర్ ఫుట్సల్ లీగ్ కోసం ఆంథమ్ సాంగ్ ను విరాట్ కోహ్లీ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహహాన్ సంగీత సారథ్యంలో స్వయంగా ఆలపించారు. చెన్నైలోని ఏఆర్ రహమాన్ స్టూడియోలో తాను పాట పాడుతున్న ఫొటోను ట్విట్టర్ లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు కోహ్లీ. ఏఆర్ రెహమాన్ గారికి నేను వీరాభిమానిని. ఆయన మ్యూజిక్ డైరెక్షన్‌లో ఆంథమ్ సాంగ్‌కు నా గొంతు ఇవ్వడం గొప్ప, అరుదైన అవకాశంగా భావిస్తున్నానంటూ కోహ్లీ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. కోహ్లీ ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com